Samantha: అందుకే శాకుంతలం ప్రమోషన్స్ నుండి తప్పుకున్నా – సమంత

స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత కనిపించడం లేదు.

Samantha: అందుకే శాకుంతలం ప్రమోషన్స్ నుండి తప్పుకున్నా – సమంత

Samantha Skipped Shaakuntalam Promotions As Down With Fever

Updated On : April 12, 2023 / 5:49 PM IST

Samantha: స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. మైథలాజికల్ కథతో వస్తున్న శాకుంతలం మూవీలో సమంత శకుంతల పాత్రలో నటించింది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు.

Samantha : నాకు అన్ని ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను.. కానీ ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను.. 

ఇటీవల వరుస ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో సమంత పాల్గొంటూ సందడి చేస్తోంది. శాకుంతలం సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు సమంత తీవ్రంగా కష్టపడుతుంది. అయితే, సడెన్‌గా శాకుంతలం ప్రమోషన్స్ నుండి సమంత తప్పుకుంది. కేవలం దర్శకుడు గుణశేఖర్ మాత్రమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీంతో సమంత ఎందుకు ప్రమోషన్స్‌లో పాల్గొంటలేదా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే సమంత, తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Samantha : శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత సందడి..

సమంత ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అంతేగాక, ఆమెకు గొంతునొప్పి కూడా చాలా తీవ్రంగా ఉందట. డాక్టర్లు తనను రెస్ట్ తీసుకోమని చెప్పారని.. అందుకే తాను శాకుంతలం ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు సమంత పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఇక శాకుంతలం సినిమా తప్పక విజయాన్ని అందుకుంటుందని సామ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తుండగా, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.