Samantha : పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు..
విడాకుల తర్వాత నుంచి సమంత ఎక్కువగా దేశంలోని పలు దేవాలయాలు, ప్రార్థన స్థలాలకు వెళ్తుంది. అక్కడ పూజలు చేస్తుంది. తాజాగా సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించింది. అయితే ఈ ఆలయంలోకి................

Samantha special worships in Palani Subrahmanya Swami Temple at Tamilanadu
Samantha : స్టార్ హీరోయిన్ సమంత కొన్ని నెలల క్రితం తనకి మాయోసైటిస్ అనే వ్యాధి సోకిందని, చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. అప్పట్నుంచి కొన్ని నెలలు ఎవరికీ కనపడకుండా, సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా లేకుండా చెన్నైలోని తన ఇంట్లో ఉంటూనే సమంత చికిత్స తీసుకుంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత కనపడి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పింది.
ఇక అప్పట్నుంచి సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ షూటింగ్స్, జిమ్ లకు కూడా వెళ్తూ బ్యాక్ టు వర్క్ అయింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. దీంతో షూటింగ్ ఉన్నప్పుడల్లా ముంబై వెళ్తూ వస్తుంది. అలాగే త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి సినిమా కూడా షూట్ కి వెళ్తుందని తెలిపింది.
Vijay Sethupathi : మీరు సెలబ్రిటీ, అది మర్చిపోకండి.. విజయ్ సేతుపతికి కౌంటర్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
ఇక విడాకుల తర్వాత నుంచి సమంత ఎక్కువగా దేశంలోని పలు దేవాలయాలు, ప్రార్థన స్థలాలకు వెళ్తుంది. అక్కడ పూజలు చేస్తుంది. తాజాగా సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించింది. అయితే ఈ ఆలయంలోకి వెళ్లాలంటే 600 మెట్లు ఎక్కాలి. సమంత ఈ మెట్లు ఎక్కుతూ మెట్టు మెట్టుకు దీపం పెడుతూ భక్తితో నమస్కరిస్తూ ఆలయం లోపలికి వెళ్ళింది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది సామ్. దీంతో పళని ఆలయంలో సమంత పూజలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత మరింత త్వరగా కోలుకొని, మరింత ఫాస్ట్ గా సినిమాలు చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.