Samantha : ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమంత.. మొన్న ఆసియా.. నిన్న అమెరికా.. ఇవాళ యూరప్..

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత పలు ప్రదేశాలను సందర్శిస్తుంది.

Samantha : ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమంత.. మొన్న ఆసియా.. నిన్న అమెరికా.. ఇవాళ యూరప్..

Samantha Travelling across the World Photos and Social Media Posts goes Viral

Samantha : ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగేస్తుంది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత పలు ప్రదేశాలను సందర్శిస్తుంది.

మొదట కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ ప్రశాంతత కోసం ధ్యానం, పూజలు చేసిన సమంత ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలికి(Bali) వెళ్లి బీచ్, ప్రకృతి ప్రదేశాల్లో గడిపింది. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ న్యూయార్క్ లోని ప్రదేశాలు ఎంజాయ్ చేస్తూ అలాగే మయోసిటిస్ చికిత్స తీసుకుంటుంది. దాదాపు నెల రోజులుగా అమెరికాలోనే ఉంది సమంత. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తిరుగుతూ సమంత సందడి చేసింది.

Also Read : Parineeti Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇలా ఆసియా ఖండం, అమెరికా ఖండం తిరిగేసిన సమంత ఇప్పుడు యూరప్ ఖండంలోకి అడుగు పెట్టింది. తాజాగా యూరప్ లోని ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది సమంత. ఆస్ట్రియాలో సెల్జ్ బర్గ్ అనే నగరానికి వెళ్లి అక్కడ ఒక సరస్సు దగ్గర కూర్చొని ఆ సరస్సు ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఆ ఫోటోలని పోస్ట్ చేస్తూ.. తన ఫేవరేట్ సినిమా ది సౌండ్ అఫ్ మ్యూజిక్ ఎప్పుడు సంతోషం వచ్చినా, బాధ అనిపించినా మళ్ళీ మళ్ళీ చూస్తానని, ఎన్ని సార్లు చూసినా ఆ సినిమా బోర్ కొట్టదు అని, ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఈ సరస్సు దగ్గరే షూట్ చేశారని, ఈ సరస్సుని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ సినిమా గుర్తొస్తుందని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. ఇక నెల రోజులకు ఒక దేశం తిరిగేస్తుండటంతో సమంత వరల్డ్ టూర్ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని భావిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.