Samantha Yashoda Teaser Date Locked
Samanhta Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను నెలకొల్పింది. ఇక ఈ సినిమాలో సమంత యశోద అనే పాత్రలో చేయబోయే పర్ఫార్మెన్స్ మరో లెవెల్ లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
కాగా, తాజాగా వినాయక చవితి కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఓ సరికొత్త పోస్టర్ తో ఈ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Yashoda : ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత
ఈ సినిమాలో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హరి-హరీశ్ లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తుండగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
The indomitable will !! #YashodaTeaser on Sep 9th @ 5:49PM#YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/u4jSQZHKVC
— Samantha (@Samanthaprabhu2) August 31, 2022