Samantha Yashoda Wraps Up Shoot
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పటికే అమ్మడు రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటిస్తుండటమే కాకుండా, వాటిని రిలీజ్‌కు కూడా రెడీ చేసేసింది. దర్శకుడు గుణ శేఖర్ ప్రెస్టీజియస్ మూవీ ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పనులు ముగించుకున్న సమంత, ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అటు ఆమె నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘యశోద’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
Samantha : ముగ్గురు ముగ్గురే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన హీరోయిన్స్..
తాజాగా యశోద చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ముగించుకుందట. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం పలు అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుకున్న దానకింటే ఎక్కువ సమయం పడుతుందట. దీంతో ఈ సినిమాను ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా ఆగస్ట్ 12న రిలీజ్ చేయడం కష్టమని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను హరి, హరీష్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంతో పాటు విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి షూటింగ్ ముగించుకున్న యశోద ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
Our #YashodaTheMovie Talkie wrapped ?
Stay tuned for exciting updates coming your way soon ? #Yashoda @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/llPODf5TkL
— Sridevi Movies (@SrideviMovieOff) July 11, 2022