Sampoornesh Babu Interesting Comments on Increasing Gold Rates
Sampoornesh Babu : హృదయ కాలేయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. అక్కడ్నుంచి వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే సంపూర్ణేష్ బాబు సినిమాలకు రాకముందు ఏం చేసాడో తక్కువ మందికే తెలుసు.
సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహ చారి. బంగారం పని ఇతని కులవృత్తి అని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇంటర్ అయిపోగానే బంగారం పని నేర్చుకొని, కొన్ని చోట్ల పని చేసి ఆ తర్వాత సొంతంగా సిద్ధిపేటలో షాప్ పెట్టుకున్నాడు. బంగారం పనుల మీద రెగ్యులర్ గా సికింద్రాబాద్ వచ్చేవాడు. ఇంటిదగ్గర బంగారం పని చేసుకునేవాడు. తనకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కొంత డబ్బు సంపాదించాక బంగారం పనుల కోసం సికింద్రాబాద్ వచ్చినప్పుడల్లా పలు సినిమా ఆఫీసులకు ఛాన్సుల కోసం తిరుగుతూ ఉండేవాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు.
Also Read : Uday Raj : ఒకప్పుడు ఆర్టిస్టులకు అసిస్టెంట్ గా పనిచేసి.. ఇప్పుడు హీరోగా సినిమా..
హృదయకాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబుగా పేరు మార్చుకున్నాడు. సంపూర్ణేష్ ఇప్పుడు సోదరా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బంగారం గురించి మాట్లాడాడు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు నగలు క్లీన్ చేస్తే డబ్బు వచ్చేది. ఇప్పుడు నగని కొనేంత డబ్బు వచ్చింది. నేను సిద్ధిపేటలో మొదట షాప్ పెట్టినప్పుడు తులం బంగారం 5000 ఉండేది. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మనం గోల్డ్ ని గొప్పగా చూస్తాం కాబట్టి అది ఎక్కువ పెరుగుతుంది, అదే మనకు కనిపిస్తుంది. కానీ అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. వాటితో పోలిస్తే బంగారం కూడా పెరిగింది. దాన్ని గొప్పగా చూస్తాం, మన దగ్గర బంగారం ఉండాలనుకుంటాం కాబట్టి అది కూడా పెరుగుతుంది అని అన్నారు.