Sampoornesh Babu : ఆ ఫోబియా వల్ల తిరుమలలో దర్శనం చేసుకోకుండా వచ్చేసా.. లైఫ్ లో వేంకటేశ్వరస్వామిని చూడలేను అనుకున్నా..
సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు.

Sampoornesh Babu Effected with Enochlophobia
Sampoornesh Babu : హృదయకాలేయం సినిమాతో ఒక్కసారిగా హీరో అంటూ సినీ పరిశ్రమలోకి వచ్చిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. త్వరలో సోదరా అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Samantha : సమంత ఫ్యాన్స్ కి నిరాశే.. ఆ వెబ్ సిరీస్ రాదు.. క్యాన్సిల్ చేసిన ఓటీటీ..
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. నాకు ఓ ఫోబియా ఉంది. నేను జనాల్లో ఎక్కువగా ఉండలేను. ఎక్కువ మంది ఉండి ఆ గుంపులో నేను ఉంటే నాకు ఊపిరి ఆడదు, ఏదో అయిపోతుంది. జనాల ఫోబియా ఉంది నాకు. ఓ సారి నేను తిరుమల వెళ్లి దర్శనం కోసం లైన్ లో ఉన్నా. ఓ గంట సేపు లైన్ లో ఉన్నాక ఊపిరి ఆడకపోవడం, భయం వేయడంతో నా వల్ల కాదు అని దర్శనం చేసుకోకుండానే బయటకి వచ్చేసాను. లైఫ్ లో ఎప్పటికీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోలేనేమో అనుకున్నాను. కానీ హీరో అయ్యాక VIP బ్రేక్ దర్శనంలో సాఫీగా వెళ్లి స్వామి దర్శనం చేసుకొని వచ్చాను అని తెలిపాడు.
ఇలా జనాలు అంటే భయపడటాన్ని ఎనోక్లో ఫోబియా(Enochlophobia) అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు గుంపులో, జనాలు ఎక్కువ మంది ఉన్న చోట ఎక్కువ సేపు ఉండలేరు. భయం, పానిక్ అవ్వడం, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ ఫోబియా లక్షణాలు.