Samantha : సమంత ఫ్యాన్స్ కి నిరాశే.. ఆ వెబ్ సిరీస్ రాదు.. క్యాన్సిల్ చేసిన ఓటీటీ..

సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు ఒప్పుకోవట్లేదు కానీ సిరీస్ లు ఒప్పుకుంటుంది అవి కూడా అడపాదడపా.

Samantha : సమంత ఫ్యాన్స్ కి నిరాశే.. ఆ వెబ్ సిరీస్ రాదు.. క్యాన్సిల్ చేసిన ఓటీటీ..

Samantha

Updated On : April 17, 2025 / 3:36 PM IST

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు ఒప్పుకోవట్లేదు కానీ సిరీస్ లు ఒప్పుకుంటుంది అవి కూడా అడపాదడపా. ఇటీవలే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన యాక్షన్ తో మెప్పించింది సమంత. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ వరుణ్ ధావన్, సమంతలతో తెరకెక్కించారు. ఈ సిటాడెల్ సిరీస్ కి రెండో సీజన్ కూడా ప్రకటించారు.

దీంతో సమంత ఫ్యాన్స్ సీజన్ 2 కూడా ఉంటుంది అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ ఓటీటీ ప్రతినిధులు చెప్పిన దానిప్రకారం సిటాడెల్ వెబ్ సిరీస్ సీజన్ 2 ని రద్దు చేసారని తెలుస్తుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతినిధులు.. సిటాడెల్ ఇండియన్ వర్షన్, ఇటాలియన్ వర్షన్స్ సీజన్ 2 లను ఆపేసి ఒరిజినల్ వర్షన్ లో వాటిని విలీనం చేస్తున్నాము. ఒరిజినల్ వర్షన్ పార్ట్ 2 మాత్రం గ్రాండ్ గా తెరకెక్కించి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని తెలిపారు.

Also Read : Abhinaya : పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్..

ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ కి ఇండియన్, ఇటాలియన్ వర్షన్స్ రీమేక్ చేసారు. ఈ రీమేక్స్ బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే బడ్జెట్ కారణంగా ఇప్పుడు రెండు రీమేక్స్ కి సీజన్ 2 ఆపేసి ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ నే గ్రాండ్ గా తీసి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సమంతని ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మళ్ళీ సిటాడెల్ లోనే యాక్షన్ లో చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు పార్ట్ 2 ఉండదు, సమంత ఈ సిరీస్ లో పార్ట్ కాదు అనడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ గానే సిటాడెల్ సిరీస్ పార్ట్ 2 తెరకెక్కుతుంది.

అసలే సమంత సినిమాలేమి ఒప్పుకోవట్లేదు, సిరీస్ లు అంతంత మాత్రమే. వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది. ఇప్పుడు సమంత చేతిలో ఒక సినిమా, ఒక సిరీస్ తప్ప ఇంకేమి లేవు. ఉన్న ఆ రెండు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. దీనికి తోడు ఇప్పుడు సిటాడెల్ సీజన్ 2 ని ఆపేయడంతో సమంత ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Also Read : Mahesh – Rajamouli : మహేష్ వచ్చాడు.. రాజమౌళి రాగానే మొదలు.. ఈ సారి నో లీక్స్..