Mahesh – Rajamouli : మహేష్ వచ్చాడు.. రాజమౌళి రాగానే మొదలు.. ఈ సారి నో లీక్స్..

గత రాజమౌళి ప్రాజెక్ట్ ల విషయంలో జరగనిది మహేశ్ చేసి చూపించారంటున్నారు ఆడియెన్స్.

Mahesh – Rajamouli : మహేష్ వచ్చాడు.. రాజమౌళి రాగానే మొదలు.. ఈ సారి నో లీక్స్..

Mahesh Return from Vacation Fans Asking Rajamouli about Next Schedule

Updated On : April 16, 2025 / 9:29 PM IST

Mahesh – Rajamouli : డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మినిమం రెండేళ్లు లాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి దర్శకధీరుడి సెట్స్ లోకి అడుగు పెట్టిన ఏ హీరోలైనా ఫ్యామిలీ, వెకేషన్స్, ట్రిప్స్ మాటలన్నీ మరిచిపోవాల్సిందే. ఎందుకంటే రాజమౌళి హీరోలంటే దర్శకధీరుడి ఆధీనంలోనే ఉండాలి మరి. కానీ మహేశ్ బాబు విషయంలో రాజమౌళి రూల్స్ వర్కౌట్ కాలేదంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

గత రాజమౌళి ప్రాజెక్ట్ ల విషయంలో జరగనిది మహేశ్ చేసి చూపించారంటున్నారు ఆడియెన్స్. ఎప్పుడులానే తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లే మహేశ్ బాబు ఇప్పుడు కూడా ఇటలీ వెకేషన్ కి వెళ్లి తిరిగొచ్చారు. దీంతో రాజమౌళి – మహేశ్ మూవీ షూటింగ్ పై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇటీవల రెండు షెడ్యూల్స్ పూర్తయిన SSMB29 ప్రాజెక్ట్ షూటింగ్ కు బ్రేక్ పడటంతో మహేష్ వెకేషన్ కి వెళ్ళాడు.

Also Read : Prabhas : ప్రభాస్ నుంచి.. ‘రాజా సాబ్’ కంటే ముందు ఆ సినిమానే వస్తుందట..

అయితే రాజమౌళి కూడా జపాన్ కి వెకేషన్ కి వెళ్ళాడు. ఇటు హీరో అటు డైరెక్టర్ ఇద్దరూ వెకేషన్స్ కు వెళ్లడంతో థర్ట్ షెడ్యూల్ కి గ్యాప్ వచ్చింది. ఇటలీలో 10 రోజులు ఫ్యామిలీతో సరదగా గడిపిన మహేశ్ బాబు హైదరాబాద్ తిరిగొచ్చేశారు. ఇటు రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది SSMB29 ప్రాజెక్ట్. రాజమౌళి జపాన్ నుంచి తిరిగి రాగానే థర్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఈ థర్ట్ షెడ్యూల్ కంప్లీట్ గా ఇండోర్ లోనే ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కాశీకి ఇంపార్టెన్స్ ఉందనే న్యూస్ బాగా వైరలయ్యింది. థర్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇదే కావచ్చని, ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను రాజమౌళి ముందుగా కంప్లీట్ చేశారని, ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతుందని చర్చ నడుస్తోంది. ఈ థర్ట్ షెడ్యూలోనూ మహేశ్ తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని తెలుస్తోంది. గతంలో అవుట్ డోర్ షూట్ కాబట్టి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి కానీ ఈ సారి లీక్స్ కి ఛాన్స్ లేదు అంటున్నారు.

Also Read : Gaddar Awards : జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డుల మీటింగ్.. మొత్తం ఎన్ని ఎంట్రీలు వచ్చాయంటే..

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది SSMB29 ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ కు ముందే మహేశ్ పాస్ పోర్ట్ ను లాగేసుకుని ఫన్నీగా ఫొటో పెట్టారు రాజమౌళి. అందరి హీరోల్లాగానే తమ హీరో కూడా రాజమౌళి చెరలో చిక్కుకుపోయారని అనుకున్నారు మహేశ్ ఫ్యాన్స్. సీన్ కట్ చేస్తే మహేశ్ విషయంలో రాజమౌళి కండీషన్స్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలా వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన మహేశ్ బాబు తిరిగొచ్చారు. సింహం వచ్చేసింది జక్కన్న మీరెక్కడా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నిటీషున్నారు. మహేష్ వచ్చేసాడు కాబట్టి రాజమౌళి రాగానే మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.