Gaddar Awards : జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డుల మీటింగ్.. మొత్తం ఎన్ని ఎంట్రీలు వచ్చాయంటే..
తాజాగా గద్దర్ అవార్డుల జ్యూరీ మీటింగ్ జరిగింది.

Gaddar Film Awards Jury Meet Held Under Jayasudha Leadership
Gaddar Awards : నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని కొన్నాళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి విధి విధానాలు రూపొందించడానికి ఓ కమిటీని కూడా వేశారు. ఇటీవల గద్దర్ అవార్డులకు అప్లై చేసుకోమని ప్రకటించారు.
తాజాగా గద్దర్ అవార్డుల జ్యూరీ మీటింగ్ జరిగింది. నటి జయసుధ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జయసుధ, దిల్ రాజు, పలువురు ప్రభుత్వ అధికారుల సమక్షంలో గద్దర్ అవార్డులకు సంబంధించి మీటింగ్ జరిగింది.
Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ..
ఈ అవార్డులకు మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. అందులో 1176 వ్యక్తిగత నామినేషన్లు, 76 సినిమా, డాక్యుమెంటరీ నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు. ఈ సినిమాలను ఏప్రిల్ 21 నుంచి జ్యూరీ సభ్యులు చూడనున్నారు. అనంతరం త్వరలోనే గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు జ్యూరీ మెంబర్స్.
Gaddar Telangana Film Awards Jury Meet Held Under Jayasudha's Leadership
The Telangana Govt has launched the prestigious #GaddarTelanganaFilmAwards to honor cinematic excellence. A jury meeting chaired by veteran actress Jayasudha was held at FDC Conference Hall. TFDC Chairman… pic.twitter.com/QP00mbpwZV
— Hyderabad Mail (@Hyderabad_Mail) April 16, 2025