Prabhas : ప్రభాస్ నుంచి.. ‘రాజా సాబ్’ కంటే ముందు ఆ సినిమానే వస్తుందట..

రాజా సాబ్ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిందని అందరికి తెలిసిందే.

Prabhas : ప్రభాస్ నుంచి.. ‘రాజా సాబ్’ కంటే ముందు ఆ సినిమానే వస్తుందట..

Prabhas Rajasaab Movie Getting More Delay another Movie will Release Before

Updated On : April 16, 2025 / 9:06 PM IST

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నాడు. ఒకటి మారుతి డైరెక్టర్ గా రాజా సాబ్, రెండోది హనురాఘవపూడి డైరెక్టర్ గా ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. సలార్, కల్కి తరువాత ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాల్లో రాజా సాబ్ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిందని అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఒక పోస్టర్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఎటువంటి అప్టేట్ లేదు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే ప్రభాస్ ఫౌజీ సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టాడంటా. అంతే కాదు సినిమాకు బల్క్ డేట్స్ కూడా ఇస్తున్నాడంట. హనురాఘవూడి చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడని టాక్.

Also Read : Gaddar Awards : జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డుల మీటింగ్.. మొత్తం ఎన్ని ఎంట్రీలు వచ్చాయంటే..

రాజా సాబ్ రీ షూట్స్ చాలా సార్లు జరిగాయని, అందుకే ప్రభాస్ డేట్స్ ను సినిమా టీమ్ సరిగ్గా వినియోగించుకోలేదన్న టాక్ విన్పిస్తోంది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. ఈ సినిమా విషయంలో ఏదో జరుగుతుందని టాలీవుడ్ లో విపరీతమైన టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రామోజి ఫిలింసిటిలో ఫౌజీ చేస్తునే, మరో వైపు అప్పుడప్పుడు రాజాసాబ్ కి డేట్స్ ఇస్తున్నాడు ప్రభాస్. దీంతో రాజాసాబ్ కంటే ముందు ఫౌజీ సినిమానే రిలీజ్ అవుతుందేమో అని సమాచారం.

ఈ రెండు షూటింగ్స్ అవ్వగానే ప్రభాస్ డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా షూట్ మొదలుపెట్టనున్నాడు. అది అయ్యాక కల్కి 2 ఆ తర్వాత సలార్ 2 సినిమాలు చేయనున్నాడు. చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నా ఒక్క అప్డేట్ కూడా రావట్లేదని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read : Yamadonga : ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?