Yamadonga : ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

తాజాగా యమదొంగ రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

Yamadonga : ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

NTR Rajamouli Yamadonga Movie Re Release Date Announced

Updated On : April 16, 2025 / 6:38 PM IST

Yamadonga : ఇటీవల వారానికొక సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ యమదొంగ సినిమా రీ రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆది, అదుర్స్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా యమదొంగ రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

Also Read : Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ..

యమదొంగ సినిమాని మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 18న రీ రిలీజ్ చేస్తున్నారు. మే 18 నుంచి 20 వరకు మూడు రోజులు థియేటర్స్ లో ఈ సినిమా ఆడనుంది. రాజమౌళి సొంత నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు మైత్రి మూవీస్ రీ రిలీజ్ చేస్తుంది. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజుని థియేటర్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు.

NTR Rajamouli Yamadonga Movie Re Release Date Announced

ఎన్టీఆర్, ప్రియమణి జంటగా మోహన్ బాబు యముడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమా 2007 లో రిలీజయి మంచి హిట్ అయింది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో యముడిగా అలరించి మెప్పించాడు.

Also See : ‘చౌర్య పాఠం’ ట్రైలర్ చూశారా? జూనియర్ మనీ హైస్ట్ లా ఉందే..