Dear Uma : మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగమ్మాయి సుమయ రెడ్డి కామెంట్స్..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Actress Sumaya Reddy Interesting Comments in Dear Uma Movie Pre Release Event
Dear Uma : తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కిస్తున్న సినిమా ‘డియర్ ఉమ’. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. పృథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డియర్ ఉమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ.. అనంతపూర్ నుంచి వచ్చినందుకు గర్వంగా ఉంది. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమా నిర్మించాను. నేను రాసి తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. దాంతో మళ్ళీ సాయి రాజేష్ గారితో డియర్ ఉమ చేశాను. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. ఈ సినిమాని విజయవంతం చేయండి అని అన్నారు.
హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. నా దియా సినిమాని తెలుగులో ఆదరించారు. ఇప్పుడు డియర్ ఉమాని ఆదరించండి. మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. బుర్రకథ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డి గారిని కలిశాను. ఆ తరువాత ఒక షార్ట్ ఫిల్మ్‌కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి గారు రాసిన కథ నాకు నచ్చింది. అలా డియర్ ఉమ సినిమా మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం కానీ కథలో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు అని తెలిపారు.
కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ.. సుమయా రెడ్డి గారు ఇచ్చిన కథ అద్భుతంగా ఉండి. ఆ కథను మరింత అద్భుతంగా తీశారు. అప్పట్లో వెంకటేష్ బాబు గణేష్ సినిమా, ఆ తర్వాత ఠాగూర్ సినిమాల్లో హాస్పిటల్ వ్యవస్థను చూపించారు. ఇప్పుడు డియర్ ఉమ సినిమాలో కూడా అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది అని అన్నారు.