Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’గా..

సంపూర్ణేష్ బాబు తన కొత్త మూవీ అప్డేట్ ఇచ్చాడు. పొలిటికల్ జోనర్ తో 'మార్టిన్ లూథ‌ర్ కింగ్' అనే చిత్రాన్ని..

Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’గా..

Sampoornesh Babu new movie Martin Luther King first look

Updated On : September 19, 2023 / 5:21 PM IST

Sampoornesh Babu : టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు టాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో తన కొత్త సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే టైటిల్‌తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు. అలాగే ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు కీరిటంతో కనిపిస్తుండగా.. ఆ కిరీటంలో పొలిటికల్ లీడర్స్, కాంపెయిన్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి.

Suresh Babu : చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత సురేష్ బాబు కామెంట్స్.. సినిమా ఇండస్ట్రీ కోసం..

ఇక పోస్టర్ బట్టి చూస్తుంటే.. మూవీ పొలిటికల్ జోనర్ తో ఉండబోతుందని అర్ధమవుతుంది. అంతేకాదు ఈ మూవీ ఒక సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా రాబోతుందని సమాచారం. 2021లో తమిళంలో తెరకెక్కిన పొలిటికల్ సెటైర్ మూవీ ‘మండేలా’ (Mandela) కి ఇది రీమేక్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogibabu) ప్రధాన పాత్రతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ అవార్డుకు కూడా ఎంపిక అయ్యింది.

Bigg Boss 7 : రెతుబిడ్డ ప్ర‌శాంత్‌కు ర‌తిక వార్నింగ్‌.. చేయి వేసావంటే మ‌ర్యాదగా ఉండ‌దు చెబుతున్నా..

అలాంటి ఈ చిత్రాన్ని సంపూర్ణేష్ బాబు ఇప్పుడు రీమేక్ చేస్తుండడంతో మంచి ఆసక్తే నెలకుంది. అయితే దీనిని పూర్తి రీమేక్ చిత్రంగా కాకుండా మెయిన్ పాయింట్ ని మాత్రం తీసుకోని పూజా కొల్లూరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో నరేష్, డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలు చేస్తున్నారు. అక్టోబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ కూడా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ చిత్రంతో సంపూర్ణేష్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.