Samudrudu Movie Team : ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో 20 శాతం పేద మత్స్యకారులకు ఇస్తాం..

సముద్రపు ఒడ్డున ఉండే మత్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

Samudrudu Movie Team Announce 20 Percent Collections to Poor Fishermen Families

Samudrudu Movie Team : కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సీనియర్ హీరో సుమన్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. సముద్రపు ఒడ్డున ఉండే మత్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అక్టోబర్ 25న సముద్రుడు సినిమా రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Pawan Kalyan : సొంత డబ్బులతో వాళ్లకు పవన్ సాయం.. దేనికంటే..?

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సుమన్ మాట్లాడుతూ.. నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు అధిగమించి హైదరాబాదులో తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాను. డైరెక్టర్ నగేష్ ఫస్ట్ సినిమా శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను. నేను చేసిన 750 సినిమాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి సినిమా చెప్పుకోదగ్గ సినిమాగా ఉంటుంది. అలాంటి మంచి సినిమాని తీసిన నగేష్ ఇప్పుడు జాలర్ల జీవితాలపై ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సముద్రుడు సినిమాతో వచ్చాడు అని అన్నారు.

హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. చత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే హిట్ అవుతుంది. డైరెక్టర్ నగేష్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. పెద్ద సినిమాకు జరిగినట్టు డిస్ట్రిబ్యూషన్ జరిగి మంచి థియేటర్లు లభించాయి. ఈనెల 25న ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమా చూడండి అని అన్నారు. దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. ఈ సినిమా జాలర్ల జీవితాన్ని చూపించే డాక్యుమెంటరీ లాగా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన సినిమా. సముద్రం దగ్గర ఉండే జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు, వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ సినిమాలో చూపించాము. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో పెద్ద హీరో అవుతాడు అన్నారు. అలాగే మూవీ టీమ్ ఈ సినిమాకు వచ్చిన రెవెన్యూలో 20 శాతం పేద మత్స్యకారుల జీవనానికి అందచేస్తామని ప్రకటించడం విశేషం.