Pawan Kalyan : సొంత డబ్బులతో వాళ్లకు పవన్ సాయం.. దేనికంటే..?
ఇటీవల విజయనగరం గుర్ల మండలం గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావం వల్ల కొందరు చనిపోయారు. అయితే ఆ కుటుంబాలను నేడు పవన్ పరామర్శించారు.

Pawan Kalyan
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు తను కమిట్ అయిన సినిమా షూటింగ్స్ సైతం స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల విజయనగరం గుర్ల మండలం గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావం వల్ల కొందరు చనిపోయారు. అయితే ఆ కుటుంబాలను నేడు పవన్ పరామర్శించారు. దీనికంటే ముందు హాస్పిటల్ బారిన పడ్డ వారిని పరామర్శించి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి బాధ్యతలు తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిపాలైన వారి బాధ్యత కూడా తామే తీసుకుంటామన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామన్నారు.
Also Read : Kiccha Sudeep : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కిచ్చా సుదీప్..
అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. విజయనగరం గుర్ల మండలం గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావం వల్ల చనిపోయిన కుటుంబాలకి వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులతో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పది కుటుంబాలకి పది లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. దీంతో మరోసారి పవన్ పై అభినందనలు కురిపిస్తున్నారు.