Ramam Raghavam : నాన్నతోనే ఫస్ట్ లవ్.. ‘రామం రాఘవం’ ఎమోషనల్ గ్లిమ్స్..

జబర్దస్త్ ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'రామం రాఘవం' మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. నాన్నతోనే ఫస్ట్ లవ్ అంటూ..

Samuthirakhani Dhanraj Koranani Ramam Raghavam Movie Glimpse release

Ramam Raghavam : తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’లో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘ధనరాజ్’. బుల్లితెర పై ఒక మంచి స్టేజికి వెళ్లిన ధనరాజ్.. వెండితెర పై కూడా పలు పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రలు చేయడంతో పాటు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక ఇన్నాళ్లు నటనతో అలరించిన ధనరాజ్.. ఇప్పుడు తన దర్శకత్వ ప్రతిభతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈక్రమంలోనే ఇటీవల ‘రామం రాఘవం’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సముద్రఖనితో పాటు ధనరాజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మూవీలో వీరిద్దరూ తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా.. ఆడియన్స్ లో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

నేడు ప్రేమికుల రోజు కావడంతో.. ‘నాన్నతోనే ఫస్ట్ లవ్’ అంటూ ఓ ఎమోషనల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ని టాలీవడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని ఆన్‌లైన్ ద్వారా లాంచ్ చేశారు. గ్లింప్స్ చూడడానికి ఆకట్టుకుంటుంది. ఇక సముద్రఖని, ధనరాజ్.. తండ్రి కొడుకులుగా బాగా సెట్ అయ్యారు. ఆడియన్స్ లో మొదటి పాస్ మార్క్ అక్కడి నుంచే వచ్చేసింది. మరి ఆ గ్లింప్స్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

Also read : R Narayana Murthy : మొన్న ఎన్టీఆర్ సినిమా.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా.. రిజెక్ట్ చేసిన ఆర్ నారాయణమూర్తి..

https://youtu.be/H_bJ0bMcD5k

ఇక గ్లింప్స్ రిలీజ్ అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ సినిమా గురించి మాట్లాడుతూ.. “ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా గానీ ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమాను తీశారు. గ్లిమ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రేమికుల రోజున తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లిమ్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉంది. ఎమోషనల్ జర్నీతో రాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాని ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘విమానం’ సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రాకెట్ రాఘవ, మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.