Puri Jagannadh : అఫీషియ‌ల్.. పూరి జగన్నాథ్‌, విజ‌య్‌ సేతుప‌తి చిత్రంలో మరో నటి..

కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోంది.

Samyuktha is being part of puri sethupathi movie

కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో తాజాగా మ‌రో న‌టి భాగ‌మైంది. న‌టి సంయుక్త జాయిన్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది.

పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి, సంయుక్త‌తో ఉన్న ఫోటోను పంచుకుంది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం.. అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది.

Chiranjeevi-Pawan Kalyan : రిలీజ్‌ డైలమాలో చిరు, పవన్‌ సినిమాలు..

ఇక ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టబు, దునియా విజయ్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భిక్షాందేహి’ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Ram Charan : బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో రామ్‌చ‌ర‌ణ్ మూవీ?

ద‌ర్శ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ కు గ‌త‌కొంత‌కాలంగా స‌రైన హిట్ ప‌డ‌డం లేదు. ఆయ‌న గత సినిమాలు లైగ‌ర్‌, డ‌బుల్ ఇస్మార్ట్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. ఈ క్ర‌మంలో విజ‌యమే ల‌క్ష్యంగా విజ‌య్‌సేతుప‌తిలో కొత్త ప్రాజెక్ట్‌ను మొద‌లుపెట్టారు.