Ram Charan : బాలీవుడ్ దర్శకుడితో రామ్‌చరణ్ మూవీ?
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ లైనప్‌పై రోజుకో న్యూస్ వైరలవుతోంది.

naga Vamsi clarity on Ram charan and Triviram Movie
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ లైనప్‌పై రోజుకో న్యూస్ వైరలవుతోంది. ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చరణ్.. నెక్స్ట్ డైరెక్టర్ విషయంలో కన్ఫర్మేషన్ ఉన్నా.. రూమర్స్ మాత్రం ఆగడంలేదు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్స్ లిస్ట్‌లోకి ఇప్పుడు ఓ బాలీవుడ్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు ఆడియెన్స్.
రామ్ చరణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే న్యూస్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరలయ్యింది. అయితే అల్లు అర్జున్‌తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిందని ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చిన కన్ఫర్మేషన్‌తో.. రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రజెంట్ త్రివిక్రమ్ చేతిలో విక్టరీ వెంకటేశ్, ఎన్టీఆర్ ప్రాజెక్స్ట్ మాత్రమే ఉన్నాయని ట్వీట్ చేశారు నాగవంశీ. దీంతో ఇప్పటివరకు హల్‌చల్ చేసిన త్రివిక్రమ్-రామ్‌చరణ్ ప్రాజెక్ట్ కేవలం గాసిపేనని తేలిపోయింది. అయితే రామ్ చరణ్ ఓ బాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు వైరల్ అవుతోన్న న్యూస్ మెగా అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తోంది.
Manchu Vishnu : రజనీకాంత్ అంకుల్ కి కన్నప్ప సినిమా చూపించా.. ఏమన్నారంటే..
రామ్‌చరణ్, బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో కిల్ లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన నిఖిల్ నగేశ్ భట్.. రామ్ చరణ్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ నిఖిల్ నగేశ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే న్యూస్ ఇప్పటిది కాదు.. చాలా కాలంగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయినా దీనిపై ఎవరూ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ సినిమా లేదని కన్ఫర్మేషన్ రావడంతో.. చరణ్-నిఖిల్ నగేశ్ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది.
ప్రజెంట్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్‌లో డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాపై అల్రెడీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇటు జంజీర్ సినిమాతో బాలీవుడ్ డైరెక్టర్ ఆల్రెడీ అపూర్వ లాఖియాకి చాన్స్ ఇచ్చి.. డిజాస్టర్ చూశారు రామ్ చరణ్. అలాంటిది మరో బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్‌ని నమ్మి.. రామ్ చరణ్ సినిమా చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.