Manchu Vishnu : రజనీకాంత్ అంకుల్ కి కన్నప్ప సినిమా చూపించా.. ఏమన్నారంటే..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న మూవీ క‌న్న‌ప్ప‌.

Manchu Vishnu : రజనీకాంత్ అంకుల్ కి కన్నప్ప సినిమా చూపించా.. ఏమన్నారంటే..

Rajinikanth watched kannappa movie and his reaction is

Updated On : June 16, 2025 / 4:20 PM IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న మూవీ క‌న్న‌ప్ప‌. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన రెండు టీజ‌ర్లు, పాట‌లు, ట్రైల‌ర్‌ సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ఇక ఈ చిత్రం జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తాజాగా కన్నప్ప చిత్రాన్ని సూప‌ర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మంచు విష్ణు తెలియ‌జేశారు.

Director Maruthi : నాతో సినిమా చేయొద్దని ప్రభాస్ కి చెప్పారు.. ప్రభాస్ ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టమని అడిగాడు..

‘రజినీకాంత్ అంకుల్ కన్నప్ప మూవీ చూశారు. ఆ తర్వాత.. న‌న్ను గ‌ట్టిగా కౌగిలించుకుని.. సినిమా నచ్చిందని చెప్పారు. ఓ నటుడిగా ఆ హగ్ కోసం నేను 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అని విష్ణు రాసుకొచ్చారు.’ ర‌జినీకాంత్‌తో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేశారు.