Chiranjeevi-Pawan Kalyan : రిలీజ్‌ డైలమాలో చిరు, పవన్‌ సినిమాలు..

రిలీజ్‌ డేట్‌ విషయంలో అటు అభిమానుల్ని, ఇటు ఆడియెన్స్‌ సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి మెగాస్టార్, పవర్‌స్టార్‌ సినిమాలు.

రిలీజ్‌ డేట్‌ విషయంలో అటు అభిమానుల్ని, ఇటు ఆడియెన్స్‌ సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి మెగాస్టార్, పవర్‌స్టార్‌ సినిమాలు. చిరంజీవి ‘విశ్వంభర’, పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమాలు రిలీజ్‌ డేట్స్ మార్చుకుంటున్నాయోగానీ.. థియేటర్స్‌లోకి మాత్రం రావడం లేదు.

ఈ రెండు సినిమాల్లో పవన్‌కల్యాణ్ పీరియాడికల్‌ మూవీ హరిహర వీరమల్లు సినిమా ఏకంగా ఆరుసార్లు రిలీజ్‌ డేట్స్‌ మార్చుకుని.. సినిమా పోస్ట్‌పోన్‌ విషయంలో రికార్డ్‌ కూడా క్రియేట్ చేసింది. దీంతో ఇది హరిహర వీరమల్లు కాదు.. వాయిదాల వీరమల్లు అంటూ ఆడియెన్స్‌తో పాటు ఫ్యాన్స్‌ కూడా అసహనం వ్యక్తం చేసే సిట్యువేషన్‌ కనపడుతోంది.

Ramcharan-NTR : రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్షన్ మరోసారి?

ఈ నెల 12న థియేటర్స్‌లోకి రావాల్సిన పవన్ సినిమా ఫైనల్‌గా హ్యాండ్‌ ఇచ్చింది. మాట వినాలి అంటూ సినిమాపై అంచనాల్ని పెంచిన పవన్‌ కల్యాణ్‌.. రిలీజ్ విషయంలో మాత్రం మాట తప్పుతు వస్తున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరుసార్లు రిలీజ్ డేట్స్‌ మార్చుకుంది ఈ పీరియాడికల్‌ హిస్టారికల్‌ మూవీ.

 

సినిమా పూర్తవడానికే కాదు.. పూర్తయిన సినిమా థియేటర్స్‌లోకి రావడానికి కూడా ఇన్ని సమస్యలా అని వర్రీ అవుతున్నారు పవన్‌ అభిమానులు. ఇటు త్వరలోనే వీరమల్లు కొత్త రిలీజ్ డేట్‌ అనౌన్స్‌ చేస్తామన్నా వీరమల్లు టీమ్.. ఇప్పడు సైలెంట్ అయ్యారు. దీంతో ఈ రిలీజ్‌ డైలమా ఇంకెన్నాళ్లు అంటున్నారు ఆడియెన్స్.

మెగా అభిమానుల్ని రిలీజ్‌ డేట్‌ విషయంలో డిజపాయింట్‌ చేస్తూ వస్తోంది చిరంజీవి విశ్వంభర సినిమా. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. నిజానికి లాస్ట్‌ ఇయర్‌ సంక్రాంతికే రిలీజ్‌ కావాల్సింది. కానీ రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ సినిమా కోసం.. తన సినిమాని పోస్ట్‌పోన్‌ చేశారు మెగాస్టార్. సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకున్న విశ్వంభర.. సమ్మర్ బాక్సాఫీస్‌ బరిలో వస్తుందంటూ మే9 రిలీజ్ డేట్‌ ఇచ్చి.. ఫైనల్‌గా ఆ డేట్‌ నుంచి కూడా తప్పుకుంది.

Manchu Vishnu : రజనీకాంత్ అంకుల్ కి కన్నప్ప సినిమా చూపించా.. ఏమన్నారంటే..

దీంతో జులై 24 ఇంద్ర రిలీజ్‌ డేట్‌న సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా.. అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఫైనల్లీ ఇటు కొత్త రిలీజ్ డేట్‌ అనౌన్స్‌ చేయకా.. అటు ప్రమోషనల్‌ కంటెంట్ ఇవ్వకా.. మెగా అభిమానులన్ని తెగ డిజపాయింట్ చేస్తున్నాయి విశ్వంభర, హరిహర వీరమల్లు సినిమాలు.