Spirit Movie : ‘స్పిరిట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సందీప్ వంగ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తమిళనాడులోని ఆ స్పెషల్ ప్లేస్..

ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ ఇటీవలే మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టాడు.

Sandeep Reddy Vanga amd Harshavardan Rameshwar Started Spirit Music Sittings Photo goes Viral

Spirit Movie : సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం భారీ లైనప్ తో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని ఆల్రెడీ సందీప్ వంగ చెప్పడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

Also Read : KA Movie : అంధ విద్యార్థుల కోసం.. కిరణ్ సబ్బవరం క సినిమా స్పెషల్ షో..

ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ ఇటీవలే మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టాడు. దీపావళికి స్పిరిట్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన చిన్న వీడియో ఒకటి షేర్ చేశారు. దీంతో స్పిరిట్ వర్క్స్ ఫాస్ట్ గానే జరుగుతున్నాయి అని భావిస్తున్నారు. తాజాగా మరో ఫోటో వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డి వంగ, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి తమిళనాడులోని మహాబలిపురం వెళ్లారు. వీరిద్దరూ కలిసి మహాబలిపురంలో దిగిన ఫోటో వైరల్ గా మారింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఈ ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ సముద్రం ఒడ్డున కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారేమో, మంచి మ్యూజిక్, మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ లో మొదలవుతుందని సమాచారం.