Sandeep Reddy Vanga: ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ముహూర్తం ఫిక్స్..!
టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీతో తన సత్తా చాటిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి చేస్తున్నాడని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ‘యానిమల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ఆడియెన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Sandeep Reddy Vanga Ranbir Kapoor Animal Movie First Look To Be Out Tomorrow
Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీతో తన సత్తా చాటిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి చేస్తున్నాడని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ‘యానిమల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ఆడియెన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగ సెకండ్ బాలీవుడ్ మూవీ
అయితే తాజాగా ఈ ‘యానిమల్’ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అయ్యాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో సందీప్ రెడ్డి ఫ్యాన్స్‌తో పాటు రణ్‌బీర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఆతృతగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టి-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నాడు. మరి యానిమల్ సినిమాతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.