Sandigdham
Sandigdham : నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా సందిగ్ధం. తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ కి చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ కి వెళ్లబోతుంది ఈ సినిమా. సందిగ్ధం సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు.
Also Read : ప్రభాస్ మెచ్చిన సినిమా.. అందర్నీ ఏడిపించిన ప్రేమకథ.. ఇప్పుడు ఓటీటీలోకి..
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించి ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెడతామని మూవీ యూనిట్ తెలిపింది. జీవ, నవీన్ రాజ్, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.