Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్.. కోటి మిస్సైన సంజన.. 15 వారాలకు ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్ బాస్ 9 తెలుగు(Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టింది సంజన గల్రాని. ఈమె రెండు వారాలకే ఎలిమినేట్ అవుతుందనుకున్నారు.కానీ, 15 వారాల పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది.
Sanjana Galrani received highest remuneration in Bigg Boss Telugu Season 9
Bigg Boss 9 Telugu: బుజ్జిగాడు సినిమాలో తన క్యూట్ మాటలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది సంజన గల్రాని. ఈ అమ్మడు ఆ తరువాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, అంతగా సక్సెస్ అవలేదు. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ కూడా పలు సినిమాలు చేసింది కానీ, తరువాత సినిమాలకు కరెక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా ఈ అమ్మడు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) తెలుగులో అడుగుపెట్టింది. ఈమెను చూసి చాలా మంది అసలు ఎవరీవిడ అనుకున్నారు. రెండు వారాలు కూడా ఉండదు ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, రెండు వారాలు కాదు ఏకంగా 15 వారాల పాటు ఆమె హౌస్ లో ఉండి ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.
Navya Swamy: వెకేషన్ మోడ్ లో సీరియల్ బ్యూటీ నవ్య స్వామి.. పొట్టి గౌనులో అందాలు కేక.. ఫొటోలు
నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9లో చాలా చప్పగా సాగుతుంది అనుకునే సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలిచింది సంజన. ఇక అప్పటి నుంచి ఆడియన్స్ దృష్టిని తన వైపుకి తిప్పుకునే ఎదో ఒకటి చేస్తూనే వస్తుంది ఉంది. తన చిలిపి పనులతో నవ్వించించి కూడా. అవసరం ఉన్నచోట బలంగా మాట్లాడింది. తన వాదనను నిర్భయంగా చెప్పుకొచ్చింది. మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది జనాలకు బాగా నచ్చింది. అందుకే ఆమెను అంతలా సపోర్ట్ చేశారు. కానీ, టాప్ 5 నుంచి ఆమె వెనుతిరగాల్సి వచ్చింది.
అయితే, ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే సంజనదే అని చెప్పాలి. ఈమీకు వారానికి రూ.2.8 లక్షల చొప్పున ముట్టజెప్పారట. అలా 15 వారాలకు గాను ఆమె ఏకంగా రూ.42 లక్షలకు పైగా రెమ్యునరేషన్ గా అందుకుంది. విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాబట్టి.. ఒకవేళ ఆమె విన అయ్యుంటే కోటి రూపాయల వరకు ఆమె అందుకునేది. కానీ, కొంతలో మిస్ అయ్యింది అని చెప్పాలి. కానీ, ఏదైతేనేం చాలా కాలం తరువాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంజన తన [ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.
