Love & War : అలియా, రణబీర్, విక్కీ కాంబోలో మూవీ.. భన్సాలీ మరో ‘ఆషీకీ’ తీయబోతున్నారా..!

సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అలియా, రణబీర్, విక్కీ కాంబోలో ఒక గొప్ప ప్రేమగాథ. మరో 'ఆషీకీ' తీయబోతున్నారా..!

Sanjay Leela Bhansali next movie with Ranbir Kapoor Alia Bhatt Vicky Kaushal

Love & War : రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి మళ్ళీ తమ సూపర్ హిట్ డైరెక్టర్ తో పని చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ‘లవ్ అండ్ వార్’ అంటూ టైటిల్ కార్డుని రిలీజ్ చేసి మూవీ కాస్ట్ ని ప్రకటించారు. ఈ సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఒక గొప్ప ప్రేమ కథని ఈ సినిమాలో చూపించబోతున్నారట.

కాగా కొన్నేళ్ల క్రిందట 2019లో సంజయ్ లీలా భన్సాలీ ఒక ప్రకటన చేశారు. ‘గంగూబాయి కతియావాడి’ తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు అలియా, రణబీర్, విక్కీతో ఒక గొప్ప ప్రేమగాథ అంటూ సినిమా అనౌన్స్ చేయడంతో.. భన్సాలీ మరో ‘ఆషీకీ’ తీయబోతున్నారా..? అనే సందేహం కలుగుతుంది. కాగా ఈ ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కి రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడే ప్రకటించేశారు.

Also read : HanuMan : హనుమాన్ సినిమా గురించి ప్రభాస్.. ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంటూ..

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో అలియా భట్ మెయిన్ లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో తన నటనతో మెప్పించి నేషనల్ అవార్డుని కూడా అలియా గెలుచుకున్నారు. ఇక రణబీర్ విషయానికి వస్తే.. సంజయ్ లీలానే రణబీర్ ని హీరోగా పరిచయం చేశారు. ‘సావరియా’ సినిమాతో రణబీర్.. హీరోగా తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు.

ఇప్పుడు ఈ సినిమాతో ఈ ముగ్గురు కలిసి పని చేస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు మొదలవుతున్నాయి. రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాతో రణబీర్ తన వైల్డ్‌నెస్ తో బాక్స్ ఆఫీస్ ని బయపెట్టినప్పటికీ.. ఫ్యాన్స్ కి మాత్రం ఎప్పటికి లవర్ బాయ్. ఈ సినిమాతో రణబీర్ మరోసారి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో రాబోతున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.