HanuMan : హనుమాన్ సినిమా గురించి ప్రభాస్.. ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంటూ..
ప్రభాస్ హనుమాన్ సినిమా గురించి ప్రశాంత్ వర్మతో మాట్లాడుతూ.. ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదు..

Prabhas comments about HanuMan movie success with prasanth varma
HanuMan : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా రిలీజయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ పాన్ ఇండియా విజయాన్ని నమోదు చేసింది. 100, 150, 200 కోట్ల మార్క్ ని దాటుకుంటూ సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండు వారలు అవుతుంది. అయినా ఇంకా హౌస్ ఫుల్ షోస్ పడుతున్నాయి.
ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతుండడంతో చాలామందికి టికెట్స్ దొరకడం లేదు. సినీ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాజకీయ లీడర్స్ కూడా సినిమా చూసి మూవీ టీంని అభినందిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మని అభినందిచారట. ఈ విషయానికి ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Also read : Kangana Ranaut : నేను డేటింగ్‌లో ఉన్నది నిజమే.. కానీ నిశాంత్‌తో కాదు
సినిమా రిలీజైన తరువాత ప్రభాస్ ని ప్రశాంత్ వర్మ కలుసుకున్నారట. ఇక మూవీ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంట కదా. క్లైమాక్స్ ఇరగదీసేశావు అంటగా” అంటూ వ్యాఖ్యానించారట. అలాగే సినిమా చూసేందుకు ప్రభాస్ కి కూడా ఒక షో ఏర్పాటు చేయమని కోరారట. ప్రస్తుతం బిజీగా ఉండడంతో ఆయన ఇంకా చూడలేదు. ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
.@PrasanthVarma about #Prabhas response after #Hanuman result pic.twitter.com/6mXD1eUAde
— Sagar (@SagarPrabhas141) January 23, 2024
కాగా ఆడియన్స్ అంతా ‘జై హనుమాన్’ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ కూడా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని రీసెంట్ గా స్టార్ట్ చేసేసారు. 2025కి ఈ సినిమాని తీసుకు వచ్చేందుకు మూవీ టీం సిద్దమవుతుంది. ఇక ఈ సీక్వెల్ హనుమాన్ పాత్రతో సాగుతుందట. ఈ హనుమాన్ పాత్రని ఒక తెలుగు స్టార్ హీరో చేస్తారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఆ స్టార్ హీరో విషయంలో చిరంజీవి, రానా దగ్గుబాటి పేర్లు వినిపిస్తున్నాయి.