Sankranthi Movies : సంక్రాంతికి బరిలో ఏకంగా పదిమంది హీరోయిన్స్.. థియేటర్స్‌లో అందాల పండగే..

సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల నుంచి ఏకంగా 10 మంది హీరోయిన్స్ వెండితెరపై అలరించబోతున్నారు.

Sankranthi Movies 2024 Ten Actresses ready to entertain in Theaters

Sankranthi Movies : సంక్రాంతి అంటేనే పెద్ద పండగ, ముఖ్యంగా సినిమాల పండగ కూడా. స్టార్స్ అంతా సంక్రాంతికి వస్తారని తెలిసిందే. ఈసారి 2024లో కూడా స్టార్స్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఈసారి జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రాబోతున్నాయి. జనవరి 13న వెంకటేష్ సైంధవ్‌ రాబోతుంది. జనవరి 14న నాగార్జున నా సామిరంగ వచ్చేస్తుంది. దీంతో ఈ సారి సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. ముందు రవితేజ ఈగల్ సినిమా కూడా బరిలో ఉన్నా ఆ తర్వాత తప్పుకుంది.

అయితే సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల నుంచి ఏకంగా 10 మంది హీరోయిన్స్ వెండితెరపై అలరించబోతున్నారు. నాలుగు సినిమాల్లో పది మంది నటిస్తుండటంతో అటు ఆ హీరోయిన్స్ ఫాలోవర్లు కూడా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేష్ బాబు ‘గుంటూరు కారం'(Guntur Kaaram) సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ఉన్నారు. శ్రీలీల ప్రస్తుతం ఏ రేంజ్ ఫామ్ లో ఉందో అందరికి తెలిసిందే. ఆల్రెడీ గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి.. అంటూ మాస్ స్టెప్పులతో ఊపేసింది. ఇక మీనాక్షి ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. దీంతో ఈ ఇద్దరి హీరోయిన్స్ అభిమానులు కూడా గుంటూరు కారం సినిమాలో వీరు ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తారా, తమ అందాలు, నటనతో మెప్పిస్తారా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ‘హనుమాన్'(Hanuman) సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. అమృత ఇప్పటికే ఓ రెండు తెలుగు సినిమాల్లో మెప్పించింది. ఇప్పుడు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా వెళ్లబోతుంది. ఇదే సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వరలక్ష్మి ఓ పక్క మెయిన్ లీడ్స్ లో సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా సినిమాలు చేస్తుంది.

వెంకటేష్ ‘సైంధవ్‌'(Saindhav) సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియాలు నటిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ మెయిన్ లీడ్ చేస్తుండగా రుహాణి శర్మ, ఆండ్రియాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆండ్రియా పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతుంది.

ఇక నాగార్జున ‘నా సామిరంగ'(Naa Saami Ranga) సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ఇలా ముగ్గురు హీరోలు ఉండటంతో ఈ ముగ్గురికి తగ్గ ముగ్గురు హీరోయిన్స్ ని తెచ్చారు. నాగార్జున సరసన కన్నడ భామ ఆషిక రంగనాథ్, అల్లరి నరేష్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. ఆషిక ఆల్రెడీ అమిగోస్ సినిమాతో తెలుగులో మెప్పించింది. మిర్నా, అల్లరి నరేష్ కలిసి ఆల్రెడీ ఉగ్రం సినిమాలో చేశారు. ఇక రుక్సార్ కూడా ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతుంది.

Also Read : Meenaakshi Chaudhary : ‘గుంటూరు కారం’ నుంచి కొత్తగా వచ్చిన మీనాక్షి చౌదరి పోస్టర్ పై మీమ్స్ చూశారా? నవ్వకుండా ఉండలేరు..

ఇలా ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలతో ఏకంగా పది మంది హీరోయిన్స్ సందడి చేయనున్నారు. అయితే ఈ పదిమందే కాక ముఖ్య పాత్రలు, గెస్ట్ పాత్రల్లో ఇంకొంతమంది సీనియర్ హీరోయిన్స్, చిన్న సినిమాల్లో నటించే హీరోయిన్స్ కూడా ఈ సినిమాల్లో కనిపించబోతున్నారు. దీంతో ఈ సంక్రాంతి హీరోలదే కాదు హీరోయిన్స్ ది కూడా అని అంటున్నారు. మరి ఏ హీరోయిన్ ఈ సంక్రాంతికి బాగా ఎగిరే గాలిపటంలా పేరు తెచ్చుకుంటుందో చూడాలి.