Meenaakshi Chaudhary : ‘గుంటూరు కారం’ నుంచి కొత్తగా వచ్చిన మీనాక్షి చౌదరి పోస్టర్ పై మీమ్స్ చూశారా? నవ్వకుండా ఉండలేరు..
గుంటూరు కారం సినిమా నుంచి మహేష్, మీనాక్షి ఉన్న పోస్టర్ ని ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Guntur Kaaram Mahesh Babu Meenakshi Chaudhary Poster Memes goes Viral in Social Media look at this
Meenaakshi Chaudhary : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి, పలు అడ్డంకులు తట్టుకొని ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తుంది గుంటూరు కారం సినిమా. ఇక ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు కూడా రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే గుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడూ లేనంతగా మహేష్ బాబువి చాలా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే హీరోయిన్స్ తో ఉన్నవి కూడా. అయితే మొదట్నుంచి మహేష్ శ్రీలీలతో ఉన్న పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేశారు కానీ మీనాక్షి చౌదరి పోస్టర్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. దీంతో అసలు సినిమాలో మీనాక్షి ఉందా అనే డౌట్ కూడా కొంతమంది వ్యక్తం చేశారు. దీంతో నిన్న మహేష్, మీనాక్షి ఉన్న పోస్టర్ ని ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
Also Reade : Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ మళ్ళీ వాయిదానా? సమ్మర్ కి లేనట్టేనా?
ఈ పోస్టర్ లో మహేష్ బాబు కూర్చొని ఉండగా మీనాక్షి వెనుక నిల్చొని మహేష్ పై చేతులు వేసి ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఆ పోజ్ మహేష్ కి మసాజ్ చేసినట్టు కొంతమందికి అనిపించడంతో మీమర్స్ ఈ పోస్టర్ పై సరదాగా పలు మీమ్స్ చేశారు. వేరే సినిమాల్లోని కొన్ని సీన్స్ తో కంపేర్ కూడా చేస్తూ పోస్టర్స్ వేశారు. ఇంకేముంది మీనాక్షి పోస్టర్ పై వస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫన్నీ మీమ్స్ పై ఓ లుక్ వేసేయండి.