Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam : గత సంవత్సరం సంక్రాంతి పండక్కి వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమాలో. చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకొని బుల్లిరాజుగా స్టార్ అయిపోయాడు.(Sankranthiki Vasthunam)
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతలకు కూడా భారీ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది. ఇటీవల పాన్ ఇండియా వచ్చాక రీమేక్స్ తగ్గినా కొన్ని కొన్ని సినిమాలు మాత్రం రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు హిట్ సినిమాలను అక్కడ రీమేక్ చేస్తున్నారు. కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి. అయినా ఈ రీమేక్స్ బాలీవుడ్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఫిక్స్ అయ్యారు.
అక్కడ కూడా ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు భాగమవుతున్నారని సమాచారం. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్ తెరకెక్కిస్తున్నారని, బాలీవుడ్ దర్శకుడే ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్స్ గురించి అప్డేట్ వినిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్రని విద్యా బాలన్, మీనాక్షి చౌదరి పాత్రని రాశిఖన్నా చేస్తున్నారని బాలీవుడ్ లో వినిపిస్తుంది.
మరి అక్షయ్ కుమార్ – విద్యా బాలన్ – రాశిఖన్నా ముగ్గురు కలిసి సంక్రాంతికి వస్తున్నాం మ్యాజిక్ ని రిపీట్ చేసి బాలీవుడ్ లో హిట్ కొడతారా చూడాలి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also See : Nehaa Pathan : కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన నేహా పఠాన్.. క్యూట్ ఫోటోలు..