Sankranthiki Vasthunam collections : వంద కోట్ల క్ల‌బ్‌లో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. వెంకీమామ హ‌వా మామూలుగా లేదుగా..

విడుద‌లైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది.

Sankranthiki Vasthunam movie enter into 100 crore club in just three days

విక్టరీ వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ చిత్రానికి జై కొడుతున్నారు. తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం త‌న దూకుడు చూపిస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది.

తొలి రోజు ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి.. విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.32 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా.. మూడో రోజు రూ.29 కోట్ల మొత్తాన్ని క‌లెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.106 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సాంగ్ ‘మాట వినాలి’ వ‌చ్చేసింది.. ప‌వ‌న్ పాడిన పాట‌ను విన్నారా?

ఏనీ సెంట‌ర్‌, సింగిల్ హ్యాండ్ విక్ట‌రీ వెంకీ మామ అంటూ మూడు రోజుల క‌లెక్ష‌న్ మొత్తాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం సంక్రాంతి సెల‌వులు ఉండ‌డంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్లు సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!

ఐశ్వ‌ర్య రాజేశ్‌, మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా.. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.