Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!

Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను ఓ దొంగ కత్తితో పొడిచిన కొన్ని గంటల తర్వాత.. రూ. కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టుగా వెల్లడైంది.

Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!

Saif Ali Khan

Updated On : January 16, 2025 / 9:17 PM IST

Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన దొంగ ఫొటో బయటకు వచ్చింది. బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఈ దొంగ ఆరుసార్లు కత్తితో పొడిచాడు. దాంతో సైఫ్ చేతికి, మెడకు, వెన్నెముకకు తీవ్రగాయలయ్యాయి. ఈ దాడికి పాల్పడిన నిందితుడు సీసీ ఫుటేజీకి చిక్కాడు. ఈ వ్యక్తి గురువారం తెల్లవారుజామున 2.33 గంటలకు అలీఖాన్ భవనంలోని మెట్ల వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది.

ముంబైలోని తన నివాసంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను ఓ దొంగ కత్తితో పొడిచిన కొన్ని గంటల తర్వాత.. అతడు రూ. కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు వెల్లడైంది. నివేదిక ప్రకారం.. సైఫ్ 4 ఏళ్ల కుమారుడు జహంగీర్ గది నుంచి దొంగ కత్తితో ఇంట్లోకి ప్రవేశించాడని, ఆపై అతని నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని సైఫ్ ఇంట్లో పనిచేసే సిబ్బంది విచారణలో వెల్లడించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Read Also : Saif Ali Khan : గతంలో కూడా సైఫ్ అలీఖాన్ పై దాడి.. తలపై విస్కీ గ్లాస్ తో కొట్టి..

ఆ వీడియోలో వ్యక్తి టీ-షర్టు, జీన్స్ ధరించి ఉన్నాడు. వీపున సామాను సంచితో భుజంపై ఆరెంజ్ కలర్ స్కార్ఫ్‌తో కనిపించాడు. ఆ వీడియోలో దొంగ మెట్లు దిగుతూ సీసీ కెమెరా వైపు నేరుగా చూస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఇంతకీ సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసింది ఈ దొంగ ఒక్కడేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగ :
సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య, నటి కరీనా కపూర్ ఖాన్, వారి కుమారులు బాంద్రా వెస్ట్‌లోని 12-అంతస్తుల భవనంలో 4 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ముంబయి పోలీసు వర్గాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి ఖాన్స్ అపార్ట్‌మెంట్‌ను దోచుకోవడానికి ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

అలీఖాన్ ఉండే భవనం పక్కనే ఉన్న కాంపౌండ్‌లోకి నిందితుడు ప్రవేశించి ఆపై గోడను దూకి పారిపోయాడు. ఖాన్‌ల భవనంలోకి ప్రవేశించిన తర్వాత వారి అపార్ట్‌మెంట్‌లో ఉన్న అంతస్తుల వరకు ఎక్కడానికి వెనుక మెట్లను ఉపయోగించాడు. లోపలికి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్‌ను ఉపయోగించాడని పోలీసులు భావిస్తున్నారు.

ఖాన్‌పై కత్తితో దాడి.. నిందితుడిపై హత్యాయత్నం కేసు :
సైఫ్ కుటుంబ సభ్యులు, పనివారి ఫిర్యాదుతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఖాన్ ఇంటిలో పనిమనిషి ఇలియామా ఫిలిప్స్ అలియాస్ లిమా దొంగను ముందుగా గుర్తించింది. ఆమె వెంటనే భయంతో గట్టిగా కేకలు పెట్టింది. ఇంతలో సైఫ్ అలీఖాన్ అప్రమత్తమై దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో ఖాన్‌ను నిందితుడు ఆరుసార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఖాన్ ఎడమ చేతి, మెడపై గాయాలు, వెన్నెముకకు కత్తి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. తనకు ఏమి కావాలని దొంగను అడగగా.. తనకు రూ. కోటి డిమాండ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు పనివాళ్లు కూడా గాయపడ్డారు.

ప్రాణాపాయం తప్పింది :
సైఫ్ అలీఖాన్‌ను ఆయన కుమారుడు ఇబ్రహీం లీలావతి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాడని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. “సైఫ్ అలీఖాన్‌పై తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడితో ఆసుపత్రిలో చేరాడు. వెన్నెముకలో కత్తితో థొరాసిక్ స్పైనల్ కార్డ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కత్తిని తొలగించడానికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. వెన్నెముకలో ద్రవం లీకవడంతో అతని ఎడమ చేతిపై మరో రెండు లోతైన గాయాలను, మెడపై మరొకటి ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్సను అందించింది” అని లీలావతి ఆసుపత్రికి చెందిన నితిన్ డాంగే తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఐసీయూలో కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Read Also : Devara 2 : కత్తి పోట్లతో హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ దేవర 2 పరిస్థితి ఏంటి..?