Devara 2 : కత్తి పోట్లతో హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ దేవర 2 పరిస్థితి ఏంటి..?

సైఫ్ అలీఖాన్ చేతిలో ప్రస్తుతం జువెల్ థీఫ్, దేవర 2 సినిమాలు ఉన్నాయి.

Devara 2 : కత్తి పోట్లతో హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ దేవర 2 పరిస్థితి ఏంటి..?

Saif Ali Khan in Hospital NTR Fans Worrying about Devara 2

Updated On : January 16, 2025 / 6:57 PM IST

Devara 2 : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై నేడు ఉదయం దాడి జరిగిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ఓ వ్యక్తి దొంగతనానికి రాగా సైఫ్ కు మెలకువ వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేసి ఆరు చోట్ల గాయాలు చేసి పారిపోయాడు. ముఖ్యంగా మెడపై, వెన్నులో తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు. ఈ ఘటన బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆల్రెడీ ఒక శస్త్ర చికిత్స చేసినట్టు సమాచారం. పోలీసులు ఆ దుండగుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా విడుదల చేయగా అందులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని కోసం సెర్చ్ చేస్తున్నారు.

Also Read : VidaaMuyarchi Trailer : అజిత్ ‘విడాముయ‌ర్చి’ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ ..

అయితే ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నులో బలంగా కత్తి దిగింది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు అని సమాచారం. సైఫ్ ఇదివరకులా మళ్ళీ ఫుల్ యాక్టివ్ గా రావాలంటే ఆరు నెలలు కూడా పట్టొచ్చు అని బాలీవుడ్ మీడియా చెప్తున్నాయి. దీంతో సైఫ్ నెక్స్ట్ సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది.

సైఫ్ అలీఖాన్ చేతిలో ప్రస్తుతం జువెల్ థీఫ్, దేవర 2 సినిమాలు ఉన్నాయి. జువెల్ థీఫ్ షూటింగ్ దశలో ఉంది. ఇక ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సినిమాలో సైఫ్ అలీఖాన్ భైరా పాత్రలో విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 లో కూడా సైఫ్ అలీఖాన్ పాత్ర కొనసాగింపు ఉంటుంది. దీంతో సైఫ్ త్వరగా కోలుకోకపోతే దేవర 2 పరిస్థితి ఏంటి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read : Saif Ali Khan : గతంలో కూడా సైఫ్ అలీఖాన్ పై దాడి.. తలపై విస్కీ గ్లాస్ తో కొట్టి..

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది అయినా వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా మొదలవ్వనుంది. ఆ సినిమా అయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 మొదలు కానుంది. దీంతో దేవర 2 మొదలయ్యేసరికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుందని తెలుస్తుంది. మరి ఈ లోపు సైఫ్ అలీఖాన్ కోలుకుంటాడా? లేకపోతే దేవర 2 మరింత ఆలస్యం అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి దేవర 2 ఎప్పుడు మొదలవుతుంది, సైఫ్ ఎప్పటికి కోలుకుంటాడో. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.