Saif Ali Khan : గతంలో కూడా సైఫ్ అలీఖాన్ పై దాడి.. తలపై విస్కీ గ్లాస్ తో కొట్టి..

ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ తనపై గతంలో జరిగిన దాడి గురించి తెలిపాడు.

Saif Ali Khan : గతంలో కూడా సైఫ్ అలీఖాన్ పై దాడి.. తలపై విస్కీ గ్లాస్ తో కొట్టి..

Saif Ali Khan was also attacked in the past Details Here

Updated On : January 16, 2025 / 5:39 PM IST

Saif Ali Khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై నేడు తెల్లవారుజామున కత్తితో ఓ దుండగుడు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ దుండగుడు దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోయి తప్పించుకోవడానికి ఇలా కత్తితో దాడి చేసి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం సైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు సైఫ్ అలీఖాన్ కి ఏ ప్రమాదం లేదు అని చెప్పినట్లు సమాచారం.

అయితే గతంలో కూడా సైఫ్ అలీఖాన్ పై ఓ సారి దాడి జరిగింది. గత సంవత్సరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ తనపై గతంలో జరిగిన దాడి గురించి తెలిపాడు.

Also Read : Bollywood Security : మొన్న సల్మాన్.. ఇవాళ సైఫ్.. ముంబైలో సెలబ్రిటీలకు భద్రత లేదా? మహారాష్ట్ర సీఎం ఏమన్నారంటే?

సైఫ్ అలీఖాన్ ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి తమతో డ్యాన్స్ చేయమని అడిగారట. దానికి సైఫ్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి సైఫ్ వద్దకు వచ్చి తన స్నేహితురాలితో డ్యాన్స్ చేయమని అడిగాడట. కానీ సైఫ్ నేను ఇలా బయట డ్యాన్స్ చేయను అంటూ తిరస్కరించగా అతను తిట్టి నీ ఫేస్ వ్యాల్యూ చూసుకొనే కదా ఇలా ఉన్నావు, దాన్ని నాశనం చేస్తాను అంటూ అక్కడ ఉన్న విస్కీ గ్లాస్ తో తలపై కొట్టాడట. దెబ్బకి తలపై నుంచు రక్తం రాగా వాష్ రూమ్ కి వెళ్లడంతో ఆ అబ్బాయి కూడా సైఫ్ వెనకే వచ్చి మరోసారి దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడట. అక్కడ ఉన్నవాళ్లు కలగచేసుకోవడంతో అక్కడినుంచి బయటపడినట్లు తెలిపాడు సైఫ్.

ఇక ప్రస్తుతం సైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు అతను త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు. సైఫ్ ఫ్యామిలీ అంతా ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు.

Also Read : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ రాజవంశం అని తెలుసా? అతని ఆస్తులు ఎన్ని కోట్లు..?