Bollywood Security : మొన్న సల్మాన్.. ఇవాళ సైఫ్.. ముంబైలో సెలబ్రిటీలకు భద్రత లేదా? మహారాష్ట్ర సీఎం ఏమన్నారంటే?

గత కొన్ని రోజులుగా మళ్ళీ బాలీవుడ్ భయపడుతుంది.

Bollywood Security : మొన్న సల్మాన్.. ఇవాళ సైఫ్.. ముంబైలో సెలబ్రిటీలకు భద్రత లేదా? మహారాష్ట్ర సీఎం ఏమన్నారంటే?

Bollywood Celebrities Security in Question Mark Maharashtra CM Devendra Fadnavis Reacts

Updated On : January 16, 2025 / 5:01 PM IST

Bollywood Security : ముంబైలో సినీ సెలబ్రిటీలకు భద్రత లేదంటున్నారు. ఒకప్పుడు ముంబై అంటే అండర్ వరల్డ్ కి అడ్డా అని అనేవారు. బాలీవుడ్ కి కూడా అండర్ వరల్డ్, మాఫియాకు సంబంధాలు ఉండేవి అనేవారు. చాలా బాలీవుడ్ సినిమాల్లో ముంబై మాఫియా గురించి చూపించారు. కాలక్రమేణా అండర్ వరల్డ్ అంతమైంది అంటున్నా ఇప్పటికి బాలీవుడ్ ని ఎవరో ఒకరు భయపెడుతున్నారు.

గత కొన్ని రోజులుగా మళ్ళీ బాలీవుడ్ భయపడుతుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అనేక మార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ప్రభుత్వ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. సల్మాన్ ఫ్రెండ్, రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖీని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హతం చేసింది. దీంతో బాలీవుడ్ మరింత భయపడింది.

Also Read : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ రాజవంశం అని తెలుసా? అతని ఆస్తులు ఎన్ని కోట్లు..?

బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ బిక్కిబిక్కిమంటూ ఫుల్ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు. మధ్యలో కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కి కూడా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ బెదిరింపులు వచ్చాయి. సల్మాన్, బాబా సిద్ధిఖీ, షారుఖ్ కేసులను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సైఫ్ అలీఖాన్ పై దాడి. నేడు ఉదయం ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం సైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దొంగతనానికి వచ్చి దొరికిపోవడంతోనే సైఫ్ పై ఆ దుండగుడు దాడి చేసాడని పోలీసులు చెప్తున్నారు.

దీంతో సెక్యూరిటీ ఉన్న స్టార్ హీరోలకే బెదిరింపులు, దాడులు అంటే మాములు నటీనటుల పరిస్థితి ఏంటి, మాములు ప్రజల పరిస్థితి ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలకు భద్రత లేదని అక్కడి వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు సైఫ్ పై దాడితో మహారాష్ట్ర లోని ప్రతిపక్షాలు ముంబై సేఫ్ సిటీ కాదంటూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

Also Read : Saif Ali Khan : అయిదు కార్లు ఉన్నా.. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన తనయుడు..

దీనిపై తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు. నేడు మీడియాతో మాట్లాడుతూ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. ముంబై దేశంలోనే అత్యంత భద్రత కలిగిన నగరం. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి ఒక్క సంఘటన చూసి ముంబై నగరంలో భద్రత లేదు, ఇది సేఫ్ నగరం కాదు అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకుంటాం. ఈ దాడి వెనక ఎవరున్నారు అని తేల్చే పనిలో ఉన్నాం. కొంతమంది ముంబై సేఫ్ కాదు అంటూ సిటీ ఇమేజ్ ని తగ్గించే పని చేస్తున్నారు. అయినా మేము ముంబై భద్రత కోసం మా ఎఫర్ట్స్ ఎప్పటిలాగే పెడతాము అని అని అన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులపైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో మరింతమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది.