Sankranthiki Vasthunnam Movie Nine Days Collections Details here
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ కొట్టారు. అనిల్ రావి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరింది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.230కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది.
ఈ చిత్రం తొలి రోజునే భారీ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకిమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో వారంలోనూ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.
ఈ వారంలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి బాగా కలిసి రానుంది. దీంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలు నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.
₹230Crore+ Gross Worldwide in just 9 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥
Every section of audience are celebrating #SankranthikiVasthunam making it their most cherished film of this Sankranthi ❤️❤️❤️
ALL TIME RECORD FOR A REGIONAL FILM🔥
Victory @venkymama… pic.twitter.com/DO7HD8xQAs
— Sri Venkateswara Creations (@SVC_official) January 23, 2025