Laila : ‘లైలా’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘ఇచ్చుకుందాం బేబీ’ వచ్చేసింది..
తాజాగా లైలా మూవీ నుంచి రెండో పాట ఇచ్చుకుందాం బేబీని విడుదల చేశారు.

Icchukundam Baby song out now From Vishwak Sen Laila movie
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆకాంక్ష శర్మ కథానాయిక. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
ఇప్పటికే టీజర్‌తో పాటు ఓ పాటను విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా రెండో పాట ఇచ్చుకుందాం బేబీని విడుదల చేసింది. ‘ఇచ్చుకుందాం బేబీ.. ముద్దు ఇచ్చుకుందాం బేబీ’ అంటూ ఈ పాట సాగుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
ఈ మూవీలో విశ్వక్ బ్యూటీపార్లర్ నడిపించే మోడల్ సోనూగా, లైలా అనే అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రొమాన్స్, యాక్షన్, కామెడీ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.