Bobby : నేను చిరంజీవి ఫ్యాన్ అని బాలయ్య బాబుకి చెప్తే.. ఆయన భుజం మీద చెయ్యేసి.. బాబి లైఫ్ లో ఫస్ట్ టైమ్ సీక్రెట్ రివీల్..
అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో దర్శకుడు బాబీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Director Bobby speech in DaakuMaharaaj Grand SUCCESS CELEBRATIONS
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో చిత్ర బృందం బుధవారం రాత్రి అనంతపురంలో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో దర్శకుడు బాబీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలయ్యలోని నటుడికీ, భావోద్వేగాలకి పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని తీశామని, అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. అభిమానులు తాము ఎలా బాలయ్యని చూడాలని అనుకున్నామో అలా చూపించావని మెచ్చుకుంటున్నారని అన్నారు. సాధారణంగా తాను తక్కువగా మాట్లాడతానని అన్నారు. బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఒక్క మాటలో చెబుతానన్నారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నారు.
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష.. జడ్జి ఫుల్ సీరియస్
నువ్వు సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చావు అని బాలయ్య అడిగారు. అప్పుడు తాను చిరంజీవి అభిమానిని అని సినిమాల్లో ఏదైన సాధించాలని వచ్చాను అని చెప్పాను. అప్పుడు బాలయ్య.. నా భుజం పై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా వెన్ను తట్టి ప్రోత్సహించారని తెలిపారు. మరో హీరో ఇలా చేశారో లేదో తనకు తెలియదన్నారు. ఇక డాకు మహారాజ్ సినీ ప్రయాణంలో బాలయ్య మనసుని ఎంతో దగ్గర నుంచి చూశానని అన్నారు. అందుకనే మనసు పెట్టి డాకు మహారాజ్ లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు.
ఇక ఇదే ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. డాకు మహారాజ్‌ను హిట్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మంది అభిమానులను పొందడం తన అదృష్టం అన్నారు. సమాజం పై తనకు బాధ్యత ఉంద, తన ఫ్యాన్ సైతం కాలర్ ఎగరేసి గర్వపడేలా వాళ్లని చూసుకునే బాధ్యత కూడా తన పై ఉందన్నారు. ఎన్టీఆర్ తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారన్నారు. ఆయన బిడ్డగా పుట్టడం జన్మజన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. దర్శకుడు తన నుంచి నవరసాలను రాబట్టుకున్నారని చెప్పారు.
నేను చిరంజీవి ఫ్యాన్ అని బాలయ్య బాబుకి చెప్తే.. | 10TV#Balakrishna #PragyaJaiswal #DirectorBobby #Chiranjeevi #DaakuMaharaajSuccessMeet #10TV pic.twitter.com/EmoHNDhuuE
— 10Tv News (@10TvTeluguNews) January 23, 2025