Santosham Awards
Santosham Awards : 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్, మురళీ మోహన్, మోహన్ బాబు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్.. ఇలా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు.(Santosham Awards )
ఈ ఈవెంట్ లో వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాత అశ్వినీ దత్ కి సన్మానం నిర్వహించారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం జరిగింది. మోహన్ బాబు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా, మంచు విష్ణు బెస్ట్ హీరోగా, మంచు మూడో తరం అవ్రామ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నప్ప సినిమాకు గాను అవార్డులు గెలుచుకున్నారు.
Also Read : Sasivadane : ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమా.. ఎప్పట్నుంచో వెయిటింగ్..
కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ మురళీమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు సన్మానం నిర్వహించారు.
నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యదు వంశీ, మధుప్రియ, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి.. పలువురు వివిధ విభాగాల్లో బాబు మోహన్ చేతుల మీదుగా సంతోషం అవార్డ్స్ అందుకున్నారు.
Also Read : Thama Teaser : రష్మిక ఫస్ట్ హారర్ సినిమా.. ‘థామా’ టీజర్ వచ్చేసింది..
ఓటిటి విభాగంలో 90s సిరీస్, సిరీస్ లో నటించిన హాసన్, రోహన్ రాయ్ లు అవార్డులు గెలుచుకున్నారు. ఓటీటీ కేటగిరిలో నటి జోర్దార్ సుజాత కూడా అవార్డు అందుకుంది. ఈ సంతోషం అవార్డ్స్ ఘనంగా జరిగినందుకు చైర్మన్ సురేష్ కొండేటి విచ్చేసిన సెలబ్రిటీలు, సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ కు ధన్యవాదాలు తెలిపారు.