మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా?

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 10:24 AM IST
మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా?

Updated On : September 5, 2019 / 10:24 AM IST

దేశమంతా వినాయక చవితి వేడుకల్లో మునిగిపోయింది. ఈ సందర్బంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ కూడా గణేశుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘గణపతి బప్పా మోరియా.. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి. ఈ సంవత్సరం అంతా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం సారా ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే ఆ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు ‘నువ్వు ముస్లింవేనా? పవిత్ర మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా? అసలు నీ మతం ఏమిటో నీకు గుర్తుందా’ అంటూ  కామెంట్లు చేశారు. ఈ  ట్రోల్స్‌పై స్పందించిన ఆమె అభిమానులు… ‘భారత్‌లో ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన  భగవంతుడిని కొలవచ్చు. వినాయక చవితితో పాటు ఈద్‌ కూడా గొప్పగా జరుపుకోవాలి సారా అంటూ చెప్పుకొచ్చారు. 

సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది రిలీజ్‌ అయిన కేథార్‌నాథ్, సింబా సినిమాలతో ఆకట్టుకున్న సారా.. ప్రస్తుతం కూలీ నెంబర్‌ 1తో పాటు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉన్నారు.