Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ ట్రీట్‌గా మే 12న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో....

Sarakaru Vaari Paata Completes 50 Days
Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ ట్రీట్‌గా మే 12న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. ఇక చాలా రోజుల తరువాత మహేష్ నుండి బోల్డ్ డైలాగులు కూడా ఈ సినిమాలో వినిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.
Sarkaru Vaari Paata: సర్‌ప్రైజ్ ఇస్తోన్న సర్కారు వారి పాట.. ఏమిటంటే?
ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్‌ను తెచ్చుకుని సూపర్ హిట్ బొమ్మగా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘనత సాధించింది. సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది.
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇటీవల కాలంలో 50 రోజులు సినిమా ఆడటం గగనమే అని చెప్పాలి. కానీ కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఖాయమని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ పాత్రకు అభిమానులు ఫిదా కాగా, ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.