Daksha : సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడి సినిమా.. ఓటీటీలోకి వచ్చేసిన దక్ష..

పారా నార్మల్ థ్రిల్లర్ దక్ష సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Daksha : సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడి సినిమా.. ఓటీటీలోకి వచ్చేసిన దక్ష..

Sarath Babu Son Ayush Tej Daksha Movie Streaming in OTT

Updated On : March 16, 2025 / 3:25 PM IST

Daksha : సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ దక్ష 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలయింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాణంలో వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆయుష్, అఖిల్, అను, నక్షత్ర, రియా, రవి రెడ్డి, శోభన్ బోగరాజు, పవన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ పారా నార్మల్ థ్రిల్లర్ దక్ష సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు Bcineet OTT, హంగామా OTT లలో అందుబాటులో ఉంది.

Also Read : Pushpa 3 : పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మూడేళ్ళలోనే.. సుకుమార్, అల్లు అర్జున్ టైం ఇస్తారా?

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్, నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్‌లో మంచి స్పందన లభించింది దక్ష సినిమాకు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు దక్ష నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను చూడండి అని తెలిపారు.

Sarath Babu Son Ayush Tej Daksha Movie Streaming in OTT