సరిలేరు నీకెవ్వరు సినిమా నాన్ బాహుబలి రికార్డును బద్దలు చేయడం ఖాయమని ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బాహుబలి చిత్రానికి వచ్చిన మొదటి రోజు వసూళ్లు దాటేయాలని మహేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. రెండు వందల కోట్లు కొల్లగొట్టిన హీరోల్లో మహేష్ ఒకరు. అయితే..నాన్ బాహుబలి రికార్డును బీట్ చేయలేకపోతున్నారు.
ఈ క్రమంలో భారీ ఎత్తున పిక్చర్ రిలీజ్ చేయబోతున్నారు దర్శక, నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్నీ థియేటర్లలో మహేష్ పాగా వేయనున్నాడు. దాదాపు 80 శాతం థియేటర్లు సరిలేరుకు కేటాయించినట్లు అంచనా. అంటే ఒక ఊరిలో ఐదు థియేటర్లు ఉంటే..అందులో నాలుగు థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు సినిమాను ప్రదర్శిస్తారన్నమాట. అంతేగాకుండా..అదనంగా రెండు షోలు వేసుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
అంటే మొత్తం ఆరు షోలు అన్నమాట. వారం రోజుల పాటు అదనంగా రెండు షోలు ప్రదర్శించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈమాటన…ఒక థియేటర్‌లో 42 షోల్లో మహేష్ దుమ్ము రేపనున్నాడు. అధిక సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించడం, షోలు ఎక్కువ కావడంతో నాన్ – బాహుబలి రికార్డులను పక్కాగా బద్దలు కొట్టే అవకాశాలున్నాయి.
సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కింది. మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి ఈ సినిమా ద్వార రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, అజయ్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో GMB ఎంటర్ టైన్ మెంట్, A.K. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలరించాయి. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజ్ కాబోతోంది.
Read More : CAA ఎఫెక్ట్ : బర్త్, డెత్ సర్టిఫికేట్స్ కోసం క్యూ