సైనికుడి గొప్పతనం : సరిలేరు నీకెవ్వరు ఆంథమ్

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 02:29 PM IST
సైనికుడి గొప్పతనం : సరిలేరు నీకెవ్వరు ఆంథమ్

Updated On : December 23, 2019 / 2:29 PM IST

భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా..జనగణమన అంటూనే దూకే వాడు సైనికుడు. పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాన్ వచ్చినా..వెనుకడుగే లేదంటూ..దాటే వాడు సైనికుడు..అంటున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని టైటిల్ సాంగ ను చిత్ర యూనిట్ 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం విడుదల చేసింది. సైనికుడి గొప్పతనం గురించి ఉన్న ఈ పాట..అభిమానులను అలరిస్తోంది.

 

ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సాహిత్యం, లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్ పాడిన పాట అత్యద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. యూరప్ లోని మేసెడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి ఈ పాటను రికార్డు చేయడం విశేషం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన పాటలు కూడా అభిమానులను అలరిస్తున్నాయి. 

 

అనీల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సమర్ఫణలో జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, ఎ.కె. ఎంటర్ టైన్స్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

సీనియర్ నటి విజయశాంతి కీ రోల్ పోషిస్తున్నారు ఈ సినిమాలో. సంక్రాంతి పండుగ సందర్భంగా 2020, జనవరి 11వ తేదీన…సినిమాను విడుదల చేయడానికి టీం సన్నాహాలు చేస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 05వ తేదీ సాయంత్రం జరుగనుంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న సినిమాలకు సరిలేరు…ఎలాంటి పోటినిస్తుందో చూడాలి. 
Read More : ఆరాధ్య అభినయం : మనవరాలి స్పీచ్‌కు మురిసిన బిగ్ బి