Sarkaru Vaari Paata Most Viewed Telugu Trailer In 24 Hours
Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ దెబ్బ ఎలా ఉంటుందా అని అందరూ అనుకుంటున్నట్లుగానే, ఈ చిత్ర ట్రైలర్ దెబ్బ ఎంత సాలిడ్‌గా ఉందో యూట్యూబ్ రికార్డులను చూస్తే తెలుస్తోంది. మహేష్ దెబ్బకు యూట్యూబ్ గత 24 గంటలుగా అల్లాడిపోతుంది. ఏప్రిల్ 2న సాయంత్రం 4.05 గంటలకు మొదలైన మహేష్ బాబు మెంటల్ మాస్ స్వాగ్, 24 గంటలపాటకు కొనసాగుతూనే ఉంది. దీంతో తెలుగు సినిమాకు సంబంధించిన యూట్యూబ్ రికార్డులన్నీ కూడా కనుమరుగయ్యాయి.
Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!
రిలీజ్ అయిన 24 గంటల్లోనే ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఏకంగా 27 మిలియన్‌కు పైగా వ్యూస్ రావడమే కాకుండా, 1.2 మిలియన్‌కు పైగా లైకులు వచ్చిన తెలుగు ట్రైలర్‌గా యూట్యూబ్ రికార్డులను అల్లాడించాడు మహేష్. చాలా రోజుల తరువాత మహేష్ నుండి పూర్తి మాస్ స్టయిల్ ట్రైలర్ రావడంతో అభిమానులకు హద్దే లేకుండా పోయింది. ఈ చిత్ర ట్రైలర్‌ను పదే పదే చూస్తూ వారు తెగ ఎంజాయ్ చేశారు. ఇక కామన్ ఆడియెన్స్ కూడా సర్కారు వారి పాట మాస్ స్వాగ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేశారు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. మరో పోకిరి కానుందా..?
ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌తో పాటు ఆయన నోటి వెంట వచ్చిన మాస్ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లోనే ఎక్కువ మంది వీక్షించిన తెలుగు ట్రైలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మరి ట్రైలర్‌తోనే ఇంత రచ్చ చేసిన మహేష్, సినిమా రిలీజ్ తరువాత ఇంకెంతటి రచ్చ చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Super? @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️?❤️?#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes.
– https://t.co/ysJou3yaMn#SarkaruVaariPaata#SVPOnMay12 @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman pic.twitter.com/Yk1YVGPsdE
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 3, 2022