Sarkaru Vaari Paata: సర్కారు పోస్ట్‌పోన్ రూమర్స్.. మాట తప్పేది లేదన్న మేకర్స్!
పక్కా.. ఇచ్చిన డేట్ కు కట్టుబడి ఉన్నామంటున్నారు. మాట నిలబెట్టుకుంటామని చెప్పడానికి సర్కారు వారి పాట మేకర్స్ పదే పదే ప్రయత్నిస్తున్నారు. మే 12న మహేశ్ మూవీ రాకపోవచ్చనే గాసిప్స్..
- Naresh Mannam
- Published On : April 14, 2022 / 11:27 AM IST
Thaman Big Update On Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata: పక్కా.. ఇచ్చిన డేట్ కు కట్టుబడి ఉన్నామంటున్నారు. మాట నిలబెట్టుకుంటామని చెప్పడానికి సర్కారు వారి పాట మేకర్స్ పదే పదే ప్రయత్నిస్తున్నారు. మే 12న మహేశ్ మూవీ రాకపోవచ్చనే గాసిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని.. ఇదిగో మేము రెడీ అని డైరెక్టర్ పరశురామ్ ప్రూఫ్ లతో సహా చూపించేస్తున్నాడు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పూర్తి.. కానీ!
మాటంటే మాటే.. మే 12న వస్తున్నామంటే.. వస్తున్నాము అంతే. ఇదీ సర్కారు వారి పాట వారి వర్షన్. సూపర్ స్టార్ మూవీ చెప్పిన డేట్ కి రాకపోవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆ రూమర్స్ కి చెక్ పెట్టేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. రావడం పక్కా అని చెప్పేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే రీసెంట్ గా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఇంకా ఒక్క పాట మాత్రమే మిగిలిందని ప్రకటించారు.
Sarkaru Vaari Paata: ముచ్చటగా మూడోసారి.. హాలీవుడ్ సినిమాలతో మహేష్ మూవీ క్లాష్!
స్పెయిన్ నుంచి మొదలెడితే దుబాయ్, గోవా, హైదరాబాద్ లో జరిగిన సర్కారు వారి పాట షూటింగ్.. చివరికి వైజాగ్, కాకినాడ ప్రాంతాల్లో ముగిసింది. ఈమధ్యే వైజాగ్ షూట్ కావడంతో సినిమా లేట్ అవుతుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే అలాంటిదేమీ లేదని ఓ పాట తెరకెక్కించేసి.. ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తామని డైరెక్టర్ పరశురామ్ చెప్తున్నాడు. సూపర్ స్టార్ మూవీ కోసం అటు బయ్యర్లు కూడా థియేటర్ల అగ్రిమెంట్స్ పూర్తి చేస్తున్నారు.
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?
నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడా.. అంటూ మే 12 కోసం ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మహేశ్ ఫ్యాన్స్. వాళ్ల ఫేవరేట్ హీరోకు సాలిడ్ హిట్ అందిస్తామని గట్టిగా చెప్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేయడం సూపర్ స్టార్ కి ఇష్టం లేదు. అందుకే ఈ నెల గ్యాప్ లో వరుసగా మిగిలిన సాంగ్స్ తో పాటూ మరో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇలా సర్కారు వారు.. ఆగనంటున్నారు. చూడాలి మరి..
