Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పూర్తి.. కానీ!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట మినహా ఈ సినిమాకు....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పూర్తి.. కానీ!

Sarkaru Vaari Paata Wraps Up Shooting Except A Song

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట మినహా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో నటిస్తున్న ఈ సినిమాను పూర్తిగా ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

Sarkaru Vaari Paata: ముచ్చటగా మూడోసారి.. హాలీవుడ్ సినిమాలతో మహేష్ మూవీ క్లాష్!

ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఓ పాట మినహా పూర్తి కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. కాగా ఈ సినిమా నుండి ఇక వరుసగా అప్‌డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలో లేదంటే చివరి వారంలో ఈ సినిమా నుండి ముచ్చటగా మూడో పాటను రిలీజ్ చేసేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుండి మరో అప్‌డేట్ రానుందా..?

కాగా ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌ను వచ్చే నెలలో రిలీజ్ చేసి, ఆ తరువాత ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక మే 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.