Satish Kaushik : గర్భవతిగా ఉన్న నటికి పెళ్లి ప్రపోజల్ చేసిన సతీష్ కౌశిక్.. సతీష్ మరణంతో ట్రెండ్ అవుతున్న నీనా-సతీష్ స్నేహం..
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా సతీష్ మరణంతో కుంగిపోయింది. ఎన్నో ఏళ్లుగా సతీష్, నీనా మంచి స్నేహితులు. కెరీర్ మొదట్లో సతీష్ తన స్కూటర్ మీద ఆమెను షూటింగ్స్ కి తీసుకెళ్లాడు. నీనా గుప్తా గతంలో తన ఆత్మకథ సచ్ కహున్ తోలో సతీష్ కౌశిక్ తో ఉన్న స్నేహం...............

satish kaushik passes away neena guptha trending in news
Satish Kaushik : ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించారు. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా బుధవారం రాత్రి మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. సతీష్ కౌశిక్ దాదాపు 100 కి పైగా హిందీ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 20 సినిమాలను దర్శకుడిగా తెరకెక్కించారు. దర్శకుడిగా, ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకొని మంచి సినిమాలని ప్రేక్షకులకు అందించాడు. దర్శకుడిగా చివరగా కాగజ్ సినిమాని 2021లో తెరకెక్కించాడు. ఇక నటుడిగా చివరిసారి రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించాడు.
రెండు రోజుల క్రితం కూడా హోలీ వేడుకలను ఘనంగా చేసుకున్నాడు సతీష్ కౌశిక్. అంతలోనే ఇలా హఠాన్మరణంతో చాలా మంది స్టార్ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తూ సతీష్ కౌశిక్ కి సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ తో ఉన్న ఫోటో షేర్ చేసి.. అందరూ మరణిస్తారని తెలుసు. కానీ నేను జీవించి ఉన్నప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ గురించి ఇలా రాస్తాననుకోలేదు. మా 45 ఏళ్ళ స్నేహం అర్దాంతరంగా ముగిసిపోయింది. సతీష్ లేకుండా నా జీవితం గతంలో లాగా ఉండదు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. కంగనా రనౌత్, మధుర్ భండార్కర్.. మరింతమంది పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా సతీష్ మరణంతో కుంగిపోయింది. ఎన్నో ఏళ్లుగా సతీష్, నీనా మంచి స్నేహితులు. కెరీర్ మొదట్లో సతీష్ తన స్కూటర్ మీద ఆమెను షూటింగ్స్ కి తీసుకెళ్లాడు. నీనా గుప్తా గతంలో తన ఆత్మకథ సచ్ కహున్ తోలో సతీష్ కౌశిక్ తో ఉన్న స్నేహం గురించి చాలా బాగా చెప్పింది. అలాగే నీనా పెళ్లి కాకుండానే గర్భవతి అయినప్పుడు ఆమెకు అండగా నిలవాలని సతీష్ నీనాని పెళ్లి చేసుకుందామని అడిగాడు. పుట్టిన పిల్లలు నా వాళ్ళే అని చెప్పండి అని కూడా సతీష్ అన్నాడట. ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాగా అని ఎంతో సపోర్ట్ ఇచ్చాడంట సతీష్. ఆ సమయంలో సతీష్ అన్న మాటలకు నీనా కన్నీళ్లు పెట్టుకుంది.
సతీష్ కౌశిక్ కూడా అనేక సార్లు పలు ఇంటర్వ్యూలలో నీనాతో ఉన్న స్నేహం గురించి పంచుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు, బాధపడకూడదు అని ఆమెకు సపోర్ట్ గా నిలవాలనుకున్నాను అని తెలిపాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వీరి పెళ్లి కాలేదు. ఆ తర్వాత నీనా వివేక్ మెహ్రాని వివాహం చేసుకుంది. అయినా ఇప్పటికి వీరిద్దరూ మంచి స్నేహితులు. వివేక్ కి కూడా సతీష్ మంచి స్నేహితుడు. సతీష్ మరణంతో మరోసారి నీనా డీలా పడిపోయింది. తనతో ఉన్న స్నేహం గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి ఎమోషనల్ అవుతుంది.