Satya Dev : సత్యదేవ్ ఆన్ ఫైర్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.. చిరంజీవి అంతలా పొగడటంలో తప్పులేదు..

ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. ఈ సినిమాలో సత్యదేవ్ విలన్ గా అదరగొట్టేశాడు. చిరంజీవితో ఫేస్ టు ఫేస్ సీన్స్ లో దుమ్ము దులిపేశాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోని ఎదురుగా పెట్టుకొని.......

Satya Dev :  చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ సినిమా లూసిఫర్ ని రీమేక్ చేసినా దానికంటే బాగుంది. ఇందులో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాధ్.. ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. పండగ పూట రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి బాస్ ఈజ్ బ్యాక్ అనేలా చేసింది. ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత చిరంజీవి గురించి కాకుండా అందరూ మాట్లాడేది సత్యదేవ్ గురించి మాత్రమే.

సత్యదేవ్ ఇప్పటికే తన సినిమాలతో మెప్పించాడు. అద్భుతంగా నటించగలడు అని వివిధ పాత్రల్లో చూపించాడు. ఒక నటుడిగా సత్యదేవ్ కి మంచి పేరు ఉంది. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కి ముందు సత్యదేవ్ ని ప్రతి ప్రమోషన్ లోనూ, ప్రతి ప్రెస్ మీట్ లోనూ చిరంజీవి పొగిడేశారు. సత్యదేవ్ ని పొగుడుతూ ట్వీట్స్ కూడా చేశారు. ఇలాంటి నటుడు నా అభిమాని అవ్వడం నాకు గర్వకారణం అన్నారు. భారతదేశంలోనే సత్యదేవ్ గొప్ప నటుడు అవుతాడు అన్నారు చిరంజీవి. ఇవన్నీ చూసిన వాళ్ళు సత్యదేవ్ ని మరీ ఆకాశానికెత్తేస్తున్నాడేంటి చిరంజీవి అనుకున్నారు. కానీ సినిమాలో సత్యదేవ్ నటన చూసిన తర్వాత చిరంజీవి తక్కువ పొగిడాడేమో అనిపిస్తుంది.

ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. ఈ సినిమాలో సత్యదేవ్ విలన్ గా అదరగొట్టేశాడు. చిరంజీవితో ఫేస్ టు ఫేస్ సీన్స్ లో దుమ్ము దులిపేశాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోని ఎదురుగా పెట్టుకొని ఆ రేంజ్ లో నెగిటివ్ రోల్ చేయడం, చిరంజీవి మీద అరవడం అనేది సాధారణ విషయం కాదు. కానీ సత్యదేవ్ అద్భుతంగా చేశాడు. చిరంజీవి, సత్యదేవ్ ఎదురు పడిన ప్రతిసారి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఒరిజినల్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కంటే కూడా బాగా చేశాడు.

GodFather Review : గాడ్‌ఫాదర్ రివ్యూ.. ఇది కదా బాస్ సినిమా అంటే.. బాస్ ఈజ్ బ్యాక్..

సత్యదేవ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్ కి సత్యదేవ్ ని చిరంజీవే సజెస్ట్ చేశాడు. ఆ పాత్రకి సత్యదేవ్ పూర్తి న్యాయం చేశాడు. సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ సత్యదేవ్ ని పొగడటంలో అస్సలు తప్పులేదు అనిపిస్తుంది. సినిమాకి సత్యదేవ్ ఇంకో పిల్లర్ లా నిలబడ్డాడు. చిరంజీవి చెప్పినట్టు సత్య భవిష్యత్తులో కచ్చితంగా టాప్ యాక్టర్ అవుతాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు