Satydev : సత్యదేవ్, విజయ్ దేవరకొండ ఒకే స్టేజిపై.. సత్యదేవ్ బ్రాండ్ అంబాసిడర్ గా..

హీరో సత్యదేవ్ కూడా ఇప్పుడు ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

Satydev : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇటీవలే కృష్ణమ్మ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. మన సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్స్, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బిజీ అవుతారని తెలిసిందే. ఈ క్రమంలో హీరో సత్యదేవ్ కూడా ఇప్పుడు ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

తెలుగు రాష్ట్రాల్లో పాలు, పాల పదార్థాలు సప్లై చేసే శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్ లో స్పెషల్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి సత్యదేవ్ తో పాటు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. అలాగే ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు శ్రీ చక్ర మిల్క్ ఎండి శ్రీ రామంజనేయులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : Pushpa 2 – HariHara Veeramallu : డిప్యూటీ సీఎం డేట్స్ ఇస్తే.. ‘పుష్ప 2’కు పోటీగా ‘హరిహర వీరమల్లు’..

ఈ కార్యక్రమంలో సత్యదేవ్ శ్రీ చక్ర మిల్క్ ప్రోడక్ట్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్టు తెలిపారు. అలాగే శ్రీ చక్ర మిల్క్ కమర్షియల్ యాడ్ ని విజయ దేవరకొండ లాంచ్ చేశాడు. కంపెనీకి సంబంధించిన బ్రోచర్లు, ఫ్లైయర్‌లు లాంచ్ చేశారు. సత్యదేవ్ కూడా యాడ్స్, ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా బిజీ అవుతున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ కల్కి సినిమా గురించి మాట్లాడి అభినందించారు. తన ఫ్రెండ్ నాగ్ అశ్విన్ కోసం ఆ గెస్ట్ పాత్ర చేశాను అని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు